పెళ్లికి ముందే ఆ పని.. కొత్తదనం కోసం ఆశ ! ఆ సర్వేలో షాకింగ్ విషయాలు

భారతీయ సంస్కృతిలో శారీరక సంబంధాలపై సర్వేలు ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నాయి. 87 శాతం మంది వివాహానికి ముందే సంబంధాలు కలిగి ఉన్నారని లేడ్ ఇన్ ఇండియా సర్వేలో తేలింది. 62 శాతం మంది తమ సంబంధాల్లో కొత్తదనం కోరుతున్నారు. 50 శాతం మంది శారీరక జీవితం మెరుగుపరచడానికి వెల్‌నెస్ ఉత్పత్తులను ఆశ్రయిస్తున్నారు. గోప్యతా లోపం, అవగాహన లేకపోవడం వల్ల సంబంధాలు ప్రతిబంధనలకు లోనవుతున్నాయి. నిపుణుల ప్రకారం, కోరికలు, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచినప్పుడే సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సర్వే సంబంధాల్లో మారుతున్న దృశ్యాలను చూపిస్తుంది.

పెళ్లికి ముందే ఆ పని.. కొత్తదనం కోసం ఆశ ! ఆ సర్వేలో షాకింగ్ విషయాలు
Shocking Survey About Physical Relations
Follow us
Prashanthi V

|

Updated on: Jan 15, 2025 | 8:10 PM

భారతీయ జీవన విధానంలో టెక్నాలజీ పెరుగుతున్నా, సంప్రదాయాలు మాత్రం మారిపోతున్నాయి. ఈ మార్పులు అనేక ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెడుతున్నాయి. ఓ సర్వే ప్రకారం 10వేల మందిలో 87 శాతం మంది వివాహానికి ముందే శారీరక సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. ఇది సంబంధాల మీద కొత్త మార్గాలను చూపిస్తూ చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేపై పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

లేడ్ ఇన్ ఇండియా సర్వే

లేడ్ ఇన్ ఇండియా 2025 పేరుతో మైమ్యూస్ అనే బెడ్రూమ్ వెల్‌నెస్ బ్రాండ్ నిర్వహించిన ఈ సర్వే 10 వేల మందికి పైగా వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వే ఆధునిక ప్రేమ, సంబంధాలు, శారీరక జీవితం గురించి ఆసక్తికరమైన నిజాలను వెల్లడించింది. వివాహానికి ముందు సంబంధాలు కలిగి ఉండటం.. ఈ విషయంపై సమాజంలో అంగీకారం పెరగడం వంటి అంశాలు ఉన్నాయి.

సంబంధాల్లో కొత్తదనం కోసం ఆశ

సర్వే ప్రకారం 62 శాతం మంది తమ సంబంధాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వారిలో 50 శాతం మంది శారీరక జీవితం మెరుగుపరచడానికి సెక్సువల్ వెల్‌నెస్ ఉత్పత్తులను ఉపయోగించాలని భావిస్తున్నారు. 55 శాతం మంది తమ శారీరక జీవితం మీద అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ డేటా ఆధునిక జీవన విధానంలో సంబంధాలు ఎలా మారుతున్నాయో చెబుతోంది.

వివాహితుల అసంతృప్తి

ఈ సర్వేలో 59 శాతం మంది వివాహితులు తమ శారీరక జీవితంపై సంతోషంగా లేరని చెప్పారు. ఇందులో మహిళల్లో 60 శాతం అసంతృప్తిగా ఉండగా.. పురుషులలో ఇది 53 శాతం మాత్రమే అని తేలింది. కారణాలు అనేకం–గోప్యత లేకపోవడం, పని ఒత్తిడి, సంబంధాల మీద సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలు అని చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం

చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం, పిల్లల బాధ్యతలు ఎక్కువ కావడం వల్ల జంటల మధ్య ఆత్మీయత తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. అలాగే సెక్స్ విషయంలో సరైన అవగాహన లేకపోవడం కూడా సమస్య అని చెబుతున్నారు. భాగస్వాములు తమ కోరికలు, భావాలు స్వేచ్ఛగా చెప్పుకోవడమే సమస్యలకు పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సర్వే కేవలం శారీరక సంబంధాల గురించి కాదు. భావోద్వేగ సంబంధాలను మెరుగుపరచే మార్గాలను సూచిస్తుంది అంటున్నారు. జంటలు తమ జీవితాన్ని మరింత ఆనందంగా గడపాలంటే.. అన్యోన్యత పెంచుకోవడం, సమస్యలను ఓపెన్‌గా మాట్లాడుకోవడం అవసరం. ఇది సంబంధాలను మాత్రమే కాదు, జీవన విధానంలో కూడా మార్పు తెస్తుందట.