ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. పవర్‌ఫుల్ దివ్యౌషధం.. ఆ సమస్యలను మడతపెట్టేస్తుంది..
కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్‌లా తింటుంటారు. కీర దోస తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు.. గుండెజబ్బుల సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
కీర దోసలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా దాగున్నాయి.. వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి.. కీరదోసకాయలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. కీరలోని పోషకాలు కణజాలాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. మనం సాధారణంగా కీరదోసకాయను సలాడ్ రూపంలో తింటాము.. ముఖ్యంగా వేసవిలో దాని డిమాండ్ పెరుగుతుంది.. ఎందుకంటే ఇది మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది.. అయితే, వేసవికాలంతోపాటు శీతాకాలంలో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. చల్లని వాతావరణంలో కీరదోస తినడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు.. కీర దోస ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: కీరదోసకాయ మన కడుపులోని వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది.. అలాగే కడుపును చల్లగా ఉంచేలా చేస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, ఇందులో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.. ఇంకా ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.
- చర్మానికి మేలు చేస్తుంది: కీరదోసకాయలు మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అందుకే దీనిని అనేక ఫేస్ ప్యాక్‌లు, సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. కీరదోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. కాబట్టి మనం దీనిని తింటే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది.
- హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది: హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించేందుకు, నివారించడానికి కీరదోసకాయలు తప్పనిసరిగా తినాలి. ఈ కూరగాయలలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్య ఉండదు. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
- బరువు తగ్గుతుంది: చలికాలంలో కీరదోసను రెగ్యులర్‌గా తింటే క్రమంగా బరువు తగ్గుతారు.. వాస్తవానికి చలి వల్ల చాలామంది ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు.. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ కాలంలో ఆయిల్ ఫుడ్ కు బదులు దోసకాయ తింటే.. క్యాలరీలు తీసుకోవడం తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
- ఎముకలకు మంచిది: రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ కీరదోసకాయలు సహాయపడుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..