Mysterious Illness: అంతుచిక్కని మిస్టరీ వ్యాధి.. 14 మంది మృత్యువాత.. ఎక్కడంటే..
అకస్మాత్తుగా వ్యాపించిన అంతుచిక్కని వ్యాధితో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడం అంతలోనే ప్రాణాలు కోల్పోవటం చూసిన తల్లిదండ్రులు స్థానికులు తల్లడిల్లిపోతున్నారు. మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అధికారులు వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. బాదల్‌లోని కుటుంబాలు ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలియక భయంతో జీవిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఓ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి 12 మంది చిన్నారులు మృతిచెందారు. తాజాగా మరో చిన్నారి కూడా ఈ వ్యాధి కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 13కి పెరిగింది. డిసెంబరు 24 నుంచి మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ వ్యాధితో ఒక్క రాజౌరీ జిల్లాలోని బధాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు మరణించారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. 48 గంటల్లోనే నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అధిక జ్వరం, తీవ్రంగా చెమటలు పట్టడం, వాంతులు, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోతుండడం ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు గుర్తించారు.
అకస్మాత్తుగా వ్యాపించిన అంతుచిక్కని వ్యాధితో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడం అంతలోనే ప్రాణాలు కోల్పోవటం చూసిన తల్లిదండ్రులు స్థానికులు తల్లడిల్లిపోతున్నారు. మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అధికారులు వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. బాదల్‌లోని కుటుంబాలు ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలియక భయంతో జీవిస్తున్నారు.
ఇదిలా ఉంటే, పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బృందాలను రంగంలోకి దించారు. కలుషితమైన నీరు లేదా ఆహారం మూలంగా ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇది అదికారికంగా మాత్రం ఇంకా ధృవీకరించలేదు. కారణాన్ని గుర్తించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..