AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఏం తెలివిరా బాబు.. భలే స్మార్ట్ గా లూటీ చేశారు..! సీసీ ఫుటేజ్ చూసి ఖాకీలే షాక్..

నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది.. దానికి రెట్టింపు వేగంతో సైబర్‌ మోసాలు కూడా భారీగా పెరిగాయి. ఇంటర్‌నెట్‌ ప్రపంచాన్ని స్మార్ట్‌గా లూటీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. టెక్నాలజీ సాయంతో రోజుకో కొత్త తరహా మోసానికి తెరలేపుతున్నారు. తాజాగా ఎవరూ ఊహించని దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. దాదాపు 10 మంది వ్యాపారులను మోసం చేసిన తరువాత గానీ, విషయం వెలుగులోకి రాలేదు..ఇంతకీ ఈ కొత్త తరహా మోసం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch: ఏం తెలివిరా బాబు.. భలే స్మార్ట్ గా లూటీ చేశారు..! సీసీ ఫుటేజ్ చూసి ఖాకీలే షాక్..
Fraudsters Swap Qr Codes
Jyothi Gadda
|

Updated on: Jan 15, 2025 | 1:19 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. తమ బ్యాంకు ఖాతాలకు చెల్లింపులను మళ్లించడానికి షాపుల బయట అతికించిన క్యూఆర్ కోడ్‌లను మార్చేసిన కొందరు మోసగాళ్ల బృందం 10 మంది దుకాణదారులను మోసం చేసింది. మధ్యప్రదేశ్‌లోని జిల్లా కేంద్రమైన ఛతర్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఇటీవల వెలుగు చూసిన ఈ స్కామ్‌లో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసి, మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా సైట్‌లలో వైరల్‌గా మారింది. స్కామర్‌లు తమ క్యూఆర్ కోడ్‌లను ఆ ప్రాంతంలోని దుకాణాల వెలుపల అంటించటం వీడియోలో కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు తమ బ్యాంకు ఖాతాలకు డబ్బును మళ్లించడానికి వారి స్వంత వాటితో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం దుకాణాల వెలుపల అతికించి ఉంచిన క్యూఆర్ కోడ్‌లను మార్చుకున్నారు. తన ఖాతాదారులు చేసిన చెల్లింపులు తన బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని మెడికల్ స్టోర్ యజమాని అనుమానం వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగితే గుట్టు రట్టైంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు, అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను మార్చుకుంటున్న ఓ వ్యక్తిని గుర్తించారు. దాంతో అతను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్యూఆర్ కోడ్‌లను మార్చినట్లు 10 నుంచి 12 షాపుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, ఆ తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసినట్లు ఛతర్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అగం జైన్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్