వార్నీ ఇదెక్కడి న్యాయం సారూ..! హెల్మెట్ లేని కానిస్టేబుల్.. రోడ్డుదాటున్న యువకుడి చెంపపగులగొట్టాడు..ఎందుకంటే..
ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మోహన్‌రాజ్ రోడ్డు దాటుతుండగా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జయప్రకాష్ అతని వద్దకు వచ్చి చెంపదెబ్బ కొట్టాడు. అయితే ఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్ హెల్మెట్ ధరించకపోవడం ఆన్‌లైన్‌లో మరింత దుమారం రేపింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వీడియో వైరల్ అయిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్ మరుసటి రోజు
నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం..దేశంలో ఎక్కడ చూసినా ప్రజల్లో నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఏ పని చేసినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు చాలా మంది. ముఖ్యంగా వాహనదారులు, రోడ్డు దాటే క్రమంలోనే పాదచారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు వస్తుంది. అలాగే, వారితో పాటుగా అవతలి వారిని కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా అలాంటి ఒక సీన్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ రోడ్డుతున్న ఓ యువకుడి చెంప పగులగొట్టాడు ఓ కానిస్టేబుల్. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ కానిస్టేబుల్ చేసిన పనికి సెల్యూట్ చేస్తారు. కానీ, సదరు కానిస్టేబుల్ తప్పుకూడా ఉందండోయ్..అదేంటంటే..
తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ సూపర్ సీన్ కనిపించింది. ఆదివారం సాయంత్రం కోయంబత్తూర్‌లోని రద్దీగా ఉండే నల్లంపాళయం-సంగనూర్ రోడ్‌లో హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న యువకుడిని చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఆ షాకింగ్ క్షణం వీడియోలో బంధించబడింది. త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫుటేజీలో, యువకుడు, చిన్నవేదంపట్టికి చెందిన మోహన్‌రాజ్‌గా గుర్తించారు. చెంపదెబ్బతో చలించిపోయి, నొప్పితో రోడ్డుపై చతికిలబడ్డాడు.
A head constable attached to #Kavundampalayam police station in #TamilNadu‘s #Coimbatore was caught on camera slapping a youth, who was crossing a road glued to his cell phone, on Sunday.
The policeman did not wear helmet while ‘punishing’ the youth for crossing the road… pic.twitter.com/2ONJrzGMHH
— Hate Detector 🔍 (@HateDetectors) January 14, 2025
నల్లంపాలెంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మోహన్‌రాజ్ రోడ్డు దాటుతుండగా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జయప్రకాష్ అతని వద్దకు వచ్చి చెంపదెబ్బ కొట్టాడు. అయితే ఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్ హెల్మెట్ ధరించకపోవడం ఆన్‌లైన్‌లో మరింత దుమారం రేపింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వీడియో వైరల్ అయిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్ మరుసటి రోజు కోయంబత్తూర్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో రిపోర్టు చేయవలసిందిగా కోరినట్టు సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..