AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits Of Roses: అందమైన గులాబీలతో రెట్టింపు సౌందర్యం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఇలా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆరోగ్యాన్ని, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడ‌డంలో కూడా గులాబీలు అద్భుత ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా నాటు గులాబీలు సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. గులాబీ రేకుల్లోని గుణాలు శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగిస్తుంది. గులాబీ రేకుల ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Health Benefits Of Roses: అందమైన గులాబీలతో రెట్టింపు సౌందర్యం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Roses Petals
Jyothi Gadda
|

Updated on: Jan 15, 2025 | 12:36 PM

Share

మెరిసే చర్మం కోసం చాలా మంది గులాబీ రేకులను ఉపయోగిస్తారు. అయితే దీన్ని జుట్టుకు కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా..? గులాబీలు ఆరోగ్యంతో పాటు అందానికి, ఆకర్షణీయమైన, బలమైన జుట్టు కోసం కూడా గులాబీ రేకులు ఉపయోగించవచ్చు. గులాబీ రేకులు శరీరం నుండి మలినాలను క్లియర్ చేయడంతో పాటు జీవక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ గులాబీలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజు కొన్ని తాజా గులాబీ రేకులను తినడం వల్ల ఇంద్రియాలను సంతృప్తిపరుస్తాయి. ఫలితంగా సహజమైన మార్గంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గులాబీ పూలు కేవలం అందానికి, అలంక‌ర‌ణకు మాత్రమే కాదు.. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాల నిధి. గులాబీ పూ రేకులలో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవేంటంటే..

గులాబీలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఎ, సోడియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. స్కాల్ప్‌లో దురద, మంట, దద్దుర్లు నుండి రక్షిస్తాయి. గులాబీ రేకులను మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ స్కాల్ప్ చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. జుట్టు పెరుగుదల కోసం గులాబీ రేకులను ఉపయోగించవచ్చు. దీని కోసం, కొన్ని గులాబీ రేకులను తక్కువ మంటపై ఉడికించుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దానితో తలకు మసాజ్ చేయాలి.

గులాబీ రేకుల హెయిర్ మాస్క్‌ కోసం దానిని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో కలబంద జెల్, పెరుగు కలుపుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టుకు అప్లై చేయండి. రోజ్‌మెరీ హెయిర్ ఆయిల్‌లో గులాబీ రేకులను వేసి అప్లై చేయవచ్చు. దీని కోసం, మీరు గులాబీ రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఆయిల్‌ కలిపి జుట్టుకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. గులాబీ రేకులతో హెయిర్ స్ప్రేని కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని గులాబీ రేకులను రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించుకుని చల్లార్చి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకుని వాడొచ్చు.

కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆరోగ్యాన్ని, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడ‌డంలో కూడా గులాబీలు అద్భుత ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా నాటు గులాబీలు సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. గులాబీ రేకుల్లోని గుణాలు శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగిస్తుంది. గులాబీ రేకుల ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్ కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..