పట్టపగలు రోడ్డు మధ్యలో మృతదేహం ఖననం.. ఎందుకు ఇలా చేశారంటే..?
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని నడి రోడ్డులో ఖననం చేశారు. పట్టపగలు అత్యధిక జనం నివసించే ప్రాంతంలో రోడ్డు మధ్యలో మృతదేహాన్ని పాతిపెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వెంట తెచ్చిన వస్తువులను అక్కడి వదిలి వేయడం, మృతదేహం పాతిపెట్టడంత స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. బరియాతు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణి బగాన్ ప్రాంతానికి సుమారు 40 నుండి 50 మంది వ్యక్తులు వచ్చి స్థానిక రహదారిని శ్మశానవాటికగా మార్చారు. పట్టణంలో పట్టపగలు రోడ్డు మధ్యలో ఓ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భయాందోళనలతో పాటు ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ సంఘటనతో స్థానిక జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాణి బగన్‌లోని సొసైటీ ప్రజలు రాత్రి నిద్రను కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం. జనవరి 3వ తేదీ మధ్యాహ్నం సుమారు 40 నుంచి 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ సొసైటీ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై పట్టపగలు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత అందరూ వెళ్లిపోయారు. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చి్ంది.
ఈ ఘటన సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాణి బగన్ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అక్కడ ఒక మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఖననం చేసిన మృతదేహం దగ్గర కొన్ని చెక్క పదార్థాలు, మట్టి కుండలు కూడా వదిలి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై స్థానికులు బరియాతు పోలీస్‌స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బరియాతు పోలీస్‌స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులను శాంతింపజేశారు. అయితే, మృతదేహాన్ని పూడ్చిపెట్టిన రహదారిపై ఉన్న భూమి గిరిజనులదేనని వాదిస్తున్నారు. గిరిజన సమాజంలోని ప్రజలు తమ బంధువుల మృతదేహాలను వారి స్వంత భూమిలో పూడ్చివేస్తారు. ఇది వారి సంప్రదాయం. జనవరి 3 న, ఈ స్థలం యజమాని బంధువు మృతదేహాన్ని ఆ స్థలంలో ఖననం చేశారు. అయినప్పటికీ పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది.
కానీ ఒక నివాస ప్రాంతంలో సాధారణ రహదారి పక్కన చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం అస్సలు సరికాదనేది అతిపెద్ద ప్రశ్న. అయితే, ఈ విషయం ఏదైనా భూ వివాదానికి సంబంధించినదా లేదా మరేదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం, మొత్తం సంఘటనకు సంబంధించి బరియాతు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దాని ఆధారంగా పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..