నేటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొత్త చిరునామా.. ‘ఇందిరా భవన్’ను ప్రారంభించిన సోనియా గాంధీ
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌ను ఎంపీ సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ తన కేంద్ర కార్యాలయాన్ని 9A కోట్ల రోడ్‌కి మార్చింది. ఇది 47 ఏళ్లుగా 24 అక్బర్ రోడ్ వద్ద కొనసాగింది.139 ఏళ్ల పార్టీకి పర్యాయపదంగా మారిన చిరునామా. ఎన్నో ఒడిదుడుకులను చూసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. పార్టీ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కలసి ప్రారంభించారు. దీని తర్వాత, పార్టీ కొత్త చిరునామా 9A కోట్ల రోడ్‌గా మార్చింది. గతంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 24 అక్బర్ రోడ్‌లో ఉండేది. బుధవారం(జనవరి 15) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రాహుల్ గాంధీ బీజేపీపై దాడికి దిగారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనే రాజకీయ సంస్థతో పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మన దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయని ఆరోపించారు. ఇప్పుడు మనం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భారత రాష్ట్రాలతో పోరాడుతున్నామన్నారు
ఇదిలావుంటే, ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మన్మోహన్ సింగ్ ఫొటోతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించారు. కొత్త ఏఐసీసీ ఆఫీస్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కొత్త ఏఐసీసీ కార్యాలయం చుట్టూ ఫ్లెక్సీలు వేశారు. అయితే నూతన AICC ఆఫీస్‌కు పార్టీ నాయకత్వం ఇందిరా భవన్‌గా పేరు పెట్టింది. ఇందిరా గాంధీ భవన్ పేరుతో ఉన్న ఈ భవనం ఆరు అంతస్తులు. ఈ భవనానికి పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిసెంబర్ 2009లో శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని పూర్తి చేయడానికి ఒకటిన్నర దశాబ్దం పట్టిందని కాంగ్రెస్ సభ్యులు చెబుతున్నారు.
ఈ భవనంలో మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI వంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంస్థల కార్యాలయాలు కూడా ఉంటాయి. 26 అక్బర్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ సేవాదళ్ కార్యాలయాన్ని కూడా తీసుకురానున్నారు. పార్టీకి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని సిద్ధం చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఇందులో పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi
Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn
— ANI (@ANI) January 15, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..