TCS Jobs: ఫ్రెషర్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు! వీరికి ఫుల్ డిమాండ్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపులోగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ ఓ ఇంటరవ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ నైపుణ్యాలతో కీలక కోర్సుల్లో డిగ్రీలు కూడా కలిగి ఉండాలని.. అలాంటి వారిని ఉద్యోగావకాశాలు వరిస్తాయని ఆయన అన్నారు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ ఓ ఇంటరవ్యూలో తెలిపారు. ఆయన కంపెనీ నియామకాలు, డిమాండ్, AI-ఫస్ట్ ఆర్గనైజేషన్‌గా మారడం వంటి వాటి వాటిపై ఈ సందర్భంగా వివరించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5 వేల మందికి తగ్గించినట్లు టీసీఎస్ తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ, కంపెనీ వృద్ధిపై దీని ప్రభావం పడలేదన్నారు. వార్షిక ప్రాతిపదికన నియామకాలు చేపడతామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బ్యాలెన్స్ జరుగుతుంది. తద్వారా 2025లో కంపెనీ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని లక్కడ్ చెప్పారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని కంపెనీ వివిధ విభాగాల్లో మరింతగా అనుసంధానం చేస్తోందని, E0, E1, E2, E3 వంటి అన్ని స్థాయిల్లో ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యమని లక్కాడ్ తెలిపారు. అందుకే టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలనుకునే వారు కేవలం కోడింగ్ నైపుణ్యాలు మాత్రమే కాకుండా వాటికి తగిన విద్యార్హత కూడా ఉండాలని ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని, అంతేగానీ ఎవరి ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్లయింట్-ఫేసింగ్, నాలెడ్జ్-ఇంటెన్సివ్ విభాగాల్లో ఏఐ కంటే మనుషుల సేవ భర్తీ చేయలేనిదని అన్నారాయన.
- ఎంట్రీ లెవెల్ E0లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్‌లు), వాటి అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన ఉండే వారు ఈ విభాగంలోకి వస్తారు.
- E1 లెవెల్‌లో ఉద్యోగులు LLM APIలతో పని చేయగలగాలి. ఇది ప్రాంప్ట్ ఇంజనీర్‌లకు సమానమైన నైపుణ్యం.
- E2 స్థాయిలో TCS GenAI సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
- E3 అంతకంటే ఎక్కువ స్థాయిలలొ ఏఐలో నైపుణ్యం, అవగాహన కలిగిన వారు, దాని అప్లికేషన్లలను అన్ని విభాగాల్లో ఉపయోగించేవారిని డీఫాల్ట్‌గా తీసుకుంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.