Meta Layoffs: మార్క్‌ జూకర్‌బర్గ్‌ షాకింగ్‌ నిర్ణయం.. మెటాలో భారీగా ఉద్యోగ కోతలు!

మెటా అధినేత మార్క్‌ జూకర్‌బర్గ్‌ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మెటా.. ఈ ఏడాది కూడా భారీగా లేఆఫ్ లకు ఉపక్రమించనుంది. ఈ మేరకు ఇప్పటికే జూకర్ బర్గ్ ప్రకటన కూడా జారీ చేశారు. తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను దాదాపు 5 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించారు..

Meta Layoffs: మార్క్‌ జూకర్‌బర్గ్‌ షాకింగ్‌ నిర్ణయం.. మెటాలో భారీగా ఉద్యోగ కోతలు!
Mark Zuckerberg
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2025 | 2:29 PM

దిగ్గజ టెక్‌ సంస్థ మెటా సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో మెటాలో భారీగా కోతలు విధించేందుకు సిద్ధమయ్యారు. మెటా ప్లాట్‌ఫామ్‌లలో తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించినట్లు, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు మొత్తం 3,600 మందిని తొలగించనున్నట్లు సమాచారం. అంటే మెటా వర్క్‌ ఫోర్స్‌లో తక్కువ పనితీరు కనబరుస్తున్న దాదాపు 5 శాతం మంది తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు.

కంపెనీని బలోపేతం చేసేందుకు పనితీరు ఆధారితమైన కోతలు చేపట్టినట్లు జుకర్‌బర్గ్ మెమోలో పేర్కొన్నారు. నాన్-రిగ్రెటబుల్ అట్రిషన్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకున్నామని, వీరిలో ప్రస్తుతం ఉన్నవారిలో 5 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తామని, మిగతా 5 శాతం మందిని కొత్తవారితో భర్తీ చేస్తామన్నారు. గత సెప్టెంబర్‌ వరకు మెటాలో మొత్తం 72,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మెటా తాజా నిర్ణయం వల్ల మొత్తం 5 శాతం ఉద్యోగులపై వేటు పడనుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత మెటా కంపెనీ విధానాలను పునర్నిర్మించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది. గతేడాది జుకర్‌బర్గ్ ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ విధానాన్ని తీసుకురాగా.. దీనిలో భాగంగా ఖర్చు తగ్గించడం, టీమ్ ఆప్టిమైజేషన్, లాభదాయకతను పెంచే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం వంటి వాటిపై దృష్టి సారించారు. దీంతో వేలాది మందిని మెటా తొలగించింది. ఇక ఈ ఏడాది కూడా భారీగా కోతలకు ఉపక్రమించింది.

నిజానికి, ట్రంప్‌, జుకర్‌బర్గ్‌ మధ్య గతంలో విభేదాలు ఉండేవి. 2021లో అమెరికా పార్లమెంటు భవనంపై ట్రంప్‌ అనుచరులు దాడి చేసిన సమయంలో మెటా ట్రంప్‌ను ఫేస్‌ బుక్‌ నుంచి బహిష్కరించింది. 2023లో తిరిగి ట్రంప్‌ ఫేస్‌బుక్‌ను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌.. జుకర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం తర్వాత మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ తీరులో మార్పు కనిపించింది. ట్రంప్‌కు అనుకూలంగా జుకర్‌ బర్గ్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.