Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా.. వద్దా ?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
ప్రస్తుతం వర్షకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా సహా అనేక వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేక చోట్ల బీభత్సం సృష్టిస్తోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫివరే కాని ఇది ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని.. ఇది ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని అనుకుంటారు. అయితే మరీ ఇలాంటి జ్వరాలు లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానానికి దూరంగా ఉండాలనుకుంటే ఏమి చేయాలి ?

ప్రస్తుతం వర్షకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా సహా అనేక వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేక చోట్ల బీభత్సం సృష్టిస్తోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫివరే కాని ఇది ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని.. ఇది ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని అనుకుంటారు. అయితే మరీ ఇలాంటి జ్వరాలు లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానానికి దూరంగా ఉండాలనుకుంటే ఏమి చేయాలి ?. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలోని వైద్యలు తెలిపిన వివరాల ప్రకారం.. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదని.. ప్రతిఒక్కరు కూడా స్నానం చేయవచ్చు. జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరంలో నొప్పి కూడా ప్రారంభమవుతుంది. జ్వరం శరీరంలోని బలహీనతను కలిగిస్తుంది. అందుకే ప్రజలు స్నానం ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లోనే గొరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఇలా స్నానం చేయడం వల్ల జ్వరాన్ని తగ్గించుకోవచ్చు అలాగే కండరాలు విశ్రాంతి తీసుకోవచ్చు. గొరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి. ఒకవేళ జ్వరం చాలా ఎక్కువగా ఉంటే.. చాలా చల్లగా ఉన్నటువంటి నీటితో స్నానం చేయకూడదు. అలా చేయడం మంచిది కాదు. చాలాసార్లు అధిక జ్వరం వల్ల ప్రజల పరిస్థితి ప్రస్తుతం మరింత దిగజారిపోయింది. లేచి కూర్చోవడానికి కూడా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ స్నానం చేయడం సాధ్యం కానివారు ఏం చేయాలంటే.. వారు తమ టవల్‌ను తీసుకొని చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనివల్ల జ్వరం నుంచి కూడా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరం దృఢత్వం పోతుంది. కానీ వాస్తవానికి తడి టవల్‌తో శరీరాన్ని శుభ్రపరచడం హానికరం మాత్రం కాదు.
ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు ఐస్ వాటర్‌ను అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఐస్ వాటర్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా తలస్నానం చేసినప్పుడు శరీరంపై.. అలాగే ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. జ్వరం వచ్చిన సమయంలో శరీరంలో నొప్పి అనేది ఉంటుది. బలహీనత అనుభూతి చెందుతుంది. ఇలాంటి సమయాల్లోనే చాలామందికి స్నానం చేయాలని అని అనిపించదు. అందుకే చల్లటి నీటితో స్నానం చేయకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల కండరాలకు కూడా ఉపశమనం ఉండంట.. అలాగే పెరిగిన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.




మరిన్ని హెల్త్ న్యూస్ కోసం