AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Signs Of Cancer: క్యాన్సర్ ముందస్తు లక్షణాలు ఇవే.. గుర్తించకపోతే చాలా డేంజర్!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. మనదేశంలో గుండెజబ్బుల తర్వాత క్యాన్సర్‌ వల్లనే ఎక్కువమంది చనిపోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. అయితే ప్రమాదకరమైన క్యాన్సర్‌ని ఫస్ట్ స్టేజీలోనే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. మరి క్యాన్సర్ ను ముందే గుర్తించడమెలా?

Signs Of Cancer: క్యాన్సర్ ముందస్తు లక్షణాలు ఇవే.. గుర్తించకపోతే చాలా డేంజర్!
Signs Of Cancer
Nikhil
|

Updated on: Oct 31, 2025 | 5:20 PM

Share

క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. సింపుల్‌గా చెప్పాలంటే శరీరంలోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరగడాన్నే క్యాన్సర్ అంటారు. శరీర డిఎన్‌ఏలో కలిగిన మార్పుల కారణంగా కొన్ని కణాలు మ్యుటేషన్ చెంది క్యాన్సర్ సెల్స్‌గా మారతాయి. క్యాన్సర్‌ను ముందు దశలో గుర్తిస్తే.. ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించొచ్చు.  క్యాన్సర్ రావడానికి ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవెలా ఉంటాయంటే..

నొప్పి.. అలసట..

రోజూ అలసటగా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. పెద్ద పేగు క్యాన్సర్‌, లుకేమియా క్యాన్సర్‌లు వచ్చే ముందు అలసట ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది. -ఏ కారణం లేకుండా ఒకేచోట నొప్పి ఏర్పడినా, ఎన్ని చికిత్సలు చేయించుకున్నా నొప్పి తగ్గకపోతున్నా.. దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి.  అలాగే శరీరంలో ఎక్కడైనా వాపు కనిపించినా, గడ్డలు లాంటివి  ఏర్పడినా అవి క్యాన్సర్‌‌కు సంబంధించినవి కావొచ్చు.

మచ్చలు వస్తుంటే..

తరచూ చర్మం ఎర్రబడుతునా, చిన్న చిన్న మచ్చలు, పులిపిర్లు వంటివి వస్తుంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. అలాంటి లక్షణాలు చర్మ క్యాన్సర్‌‌కు సంబంధించినవి కావొచ్చు. వీటితో పాటు  ఆగకుండా దగ్గు వస్తున్నా, ఉన్నట్టుండి బరువు తగ్గుతున్నా, జీర్ణసమస్యలు,  కిడ్నీ సమస్యలు తరచూ వస్తున్నా.. ఓసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. క్యాన్సర్ లక్షణాలను గమనించి సమయానికి ట్రీట్మెంట్ మొదలుపెడితే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి గట్టెక్కే వీలుంటుంది.

నోట్: ఇందులో అందించిన సమాచారం, పరిష్కారాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. వాటిని అనుసరించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?