Red Masoor Dal For Skin: ఎర్ర కంది పప్పుతో బ్యూటీని ఇలా పెంచుకోండి!
మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో ఎర్ర కంది పప్పు కూడా ఒకటి. ఎర్ర కంది పప్పుతో కేవలం ఆరోగ్యం, రుచి మాత్రమే కాదు.. బ్యూటీని కూడా పెంచుకోవచ్చు. అదేంటి? అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. నిజమే. ఎర్ర కంది పప్పులో చర్మ పోషణకు అవసరం అయ్యే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి అవసరం అయిన విటమిన్లు, మినరల్స్ ని అందిస్తుంది. పొడి చర్మం, జిడ్డు చర్మం ఎవరికైనా ఎర్ర కంది పప్పు బాగా పని చేస్తుంది. ఎర్ర కంది పప్పును ఉపయోగించి స్క్రబ్ లు, ప్యాక్ లు వేసుకోవచ్చు. ఇది చర్మానికి మంచి మాయిశ్చ రైజర్ లా..

మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో ఎర్ర కంది పప్పు కూడా ఒకటి. ఎర్ర కంది పప్పుతో కేవలం ఆరోగ్యం, రుచి మాత్రమే కాదు.. బ్యూటీని కూడా పెంచుకోవచ్చు. అదేంటి? అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. నిజమే. ఎర్ర కంది పప్పులో చర్మ పోషణకు అవసరం అయ్యే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి అవసరం అయిన విటమిన్లు, మినరల్స్ ని అందిస్తుంది. పొడి చర్మం, జిడ్డు చర్మం ఎవరికైనా ఎర్ర కంది పప్పు బాగా పని చేస్తుంది. ఎర్ర కంది పప్పును ఉపయోగించి స్క్రబ్ లు, ప్యాక్ లు వేసుకోవచ్చు. ఇది చర్మానికి మంచి మాయిశ్చ రైజర్ లా పని చేస్తుంది. ఎర్ర కంది పప్పుతో బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ని తొలగించు కోవచ్చు. మరి ఇంకెందుకు లేట్.. ఇంకా ఎర్ర కంది పప్పుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పొడి చర్మం ఉన్నవారు:
పొడి చర్మం ఉన్న వారికి చలి కాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు కాచిన పాలలో కొద్దిగా రోజ్ వాటర్, ఎర్ర కంది పప్పు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖానికి 20 నిమిషాల వరకూ స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ సాఫ్ట్ గా, షైనీగా తయారవుతుంది.
మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది:
ఎర్ర కంది పప్పు స్కిన్ హైడ్రేట్ గా చేయడమే కాకుండా మాయిశ్చరైజర్ లా కూడా పని చేస్తుంది. రెండు స్పూన్ల ఎర్ర కంది పప్పు పొడిలో.. ఒక స్పూన్ తేనెను కలిపి ముఖానికి అప్లై చేయండి. ఓ 15 నిమిషాల తర్వాత.. గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల స్కిన్ హైడ్రేట్ అయి.. నిగారింపుగా కనిపిస్తుంది.
ట్యానింగ్ తొలగుతుంది:
చాలా మంది ట్యానింగ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఎండలో తిరగడం వల్ల కూడా ట్యాన్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎర్ర కంది పప్పు పొడిలో.. శనగ పిండి కూడా కలిపి.. దాన్ని ముఖానికి బాగా పట్టించాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఉండే ట్యాన్ పోతుంది. అలాగే ముఖం అందంగా మారుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.