Seeds for Control Diabetes: ఈ గింజలను తీసుకుంటే.. డయాబెటీస్ పరార్ అంతే!
ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్. ఇప్పుడు ఇదో మహమ్మారిలా తయారైంది. ముఖ్యంగా భారత దేశంలో డయాబెటీస్ రోజులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నారు. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది దీని బారిన పడుతున్నారు. ఒక్కాసారి షుగర్ వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు. డయాబెటీస్ ను నయం చేసే మందులు ఇప్పటివరకూ లేవు. కేవలం తాత్కాలికంగా కంట్రోల్ లో ఉంచడానికి మాత్రమే మెడిసిన్ ఉంది. మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఆహారం విషయంలో జాగ్రత్తలు..

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్. ఇప్పుడు ఇదో మహమ్మారిలా తయారైంది. ముఖ్యంగా భారత దేశంలో డయాబెటీస్ రోజులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నారు. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది దీని బారిన పడుతున్నారు. ఒక్కాసారి షుగర్ వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు. డయాబెటీస్ ను నయం చేసే మందులు ఇప్పటివరకూ లేవు. కేవలం తాత్కాలికంగా కంట్రోల్ లో ఉంచడానికి మాత్రమే మెడిసిన్ ఉంది. మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే ప్రాణం మీదకు వస్తుంది.
అలాగే షుగర్ తో బాధ పడేవారు ఏది పడితే అవి తినడానికి ఉండదు. ముఖ్యంగా తీపి పదార్థాల జోలికి అస్సలు వెళ్ల కూడదు. అయితే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మాత్రం షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో విషయలను తెలుసుకున్నాం. ఇప్పుడు మధు మేహాన్ని కంట్రోల్ లో ఉంచే కొన్ని రకాల సీడ్స్ గురించి తెలుసుకుందాం.
చియా సీడ్స్
చియా సీడ్స్ లో ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల టైప్ – 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు.
గుమ్మడి కాయ విత్తనాలు:
గుమ్మడి కాయ విత్తనాలను తీసుకోవడం వల్ల షుగర్ ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. షుగర్ వల్ల శరీరంలో ఎంజైమ్ లు అనేవి ఉత్పత్తి అవుతాయి. గుమ్మడి గింజలను తరచుగా తినడం వల్ల.. ఈ ఎంజైమ్ లు క్రియా రహితం అవుతాయి. కాబట్టి డయాబెటీస్ ముప్పును దూరం చేసుకోవచ్చు.
అవిసె గింజలు:
అవిసె గింజల్లో ఇన్సాల్యుబుల్ అనే ఫైబర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్లు ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చక్కెర ఉన్న వాళ్లు మంచిది.
మెంతులు:
మెంతుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగు పరుస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. మెంతులను నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వలన బ్లడ్ షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్:
సన్ ఫ్లవర్ సీడ్స్.. వీటినే పొద్దు తిరుగుడు పువ్వులు అని కూడా అంటారు. డయాబెటీస్ ఉన్న వారు ఈ గింజలను తినడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. వీటిని నేరుగా అయినా తినవచ్చు.. లేదా నీటిలో నానబెట్టుకుని అయినా తినవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.