Health Tips: మీరు భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తున్నారా..? అనారోగ్యం బారిన పడినట్లే.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!
Health Tips: ప్రస్తుతం అనారోగ్య సమస్యలు వెంటాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, తినే ఆహారంలో సమయ వేళలు పాటించకపోవడం,..

Health Tips: ప్రస్తుతం అనారోగ్య సమస్యలు వెంటాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, తినే ఆహారంలో సమయ వేళలు పాటించకపోవడం, టెన్షన్, బయటి ఫుడ్డు తినడం, ఆహార నియమాలు పాటించకపోవడం తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. జీవన శైలిలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా మంది భోజనం చేశాక మళ్లీ ఏదో ఒకటి తింటుంటారు. అలా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత రకరకాల పనులు చేసి అనారోగ్యానికి గురవుతుంటారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
భోజనం చేశాక చేయకూడని పనులు..
► చాలా మందికి అన్నం తిన్న వెంటనే ఏవైనా పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ అలా తినడం అసలు మంచిది కాదు. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వలన ఆ పోషకాలన్ని కోల్పోతాము. అందుకే భోజనం తర్వాత గంట వరకు అసలు ఎలాంటి పండ్లను తినకూడదు.
► కొందరికి భోజనం చేయగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలాగే నిద్రపోతుంటారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేయగానే నిద్రపోతే బరువు పెరుగుతారు. తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. అలేగా టీ, కాఫీలు తాగకూడదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకూడదు. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడవండి చాలు.
► ఇక మరికొందరికి భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయండి.
(గమనిక: ఈ అంశాలన్ని ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు మీకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించాలి)
ఇవి కూడా చదవండి: