Winter Tips: చలి కాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.. లేకపోతే..
Winter Tips: ప్రస్తుతం చలికాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ముందుస్తుగా..

Winter Tips: ప్రస్తుతం చలికాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు లేకపోతే ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది. చలి కాలంలో రాత్రుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చలిపెరిఇనప్పుడు గాలిలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఇక జనవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
చలికాలంలో తాజాగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే జమ, దానిమ్మ, బొప్పాయి, అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవడం మంచిది. ఇవి జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తాయి. చలికాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, జలుబు, దగ్గు వంటివి త్వరగా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి.
మనషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. ఎప్పటికప్పుడు వండిన ఆహారాలు తీసుకోవడం మంచిది. బయటి ఆహారాన్ని దూరం పెట్టడం మంచిది. మార్కెట్‌లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి.
చర్మ రక్షణకు జాగ్రత్తలు ప్రతి రోజు బయటకు వెళ్లేవారు ఎక్కువ శాతం శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలను ధరించడం మంచిది. చాలా మందికి చలికాలంలో కూడా ఏసీ అలవాటు ఉంటుంది. ఏసీల్లో ఎక్కువగా గడపకపోవడం మంచిది. ఎండకు వెళ్లాలని అనుకుంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. స్నానం చేసే ముందు రెండు చెంచాల నూనెను నీటిలో వేయడం ద్వారా చర్మం మృధుత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. రాత్రివేళల్లో నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనెలు, లేపనాలు రాసుకుంటే మంచిది. థైరాయిడ్ తరహా సమస్యలున్న వారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు.
ఇవి కూడా చదవండి: