Health: కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారా.? అయితే ఈ చిట్కాలు పాటించండి.. వెంటనే ఫలితం..
Health: సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతుంటారు. అంటే శరీరంలో అన్ని భాగాల కంటే కళ్లు ముఖ్యమైనవి చెప్పడమే దీని ఉద్దేశం. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలన్నా.. నిత్యం పనులు చేసుకోవాలన్నా...
Health: సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతుంటారు. అంటే శరీరంలో అన్ని భాగాల కంటే కళ్లు ముఖ్యమైనవి చెప్పడమే దీని ఉద్దేశం. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలన్నా.. నిత్యం పనులు చేసుకోవాలన్నా కంటి చూపు ఉండాలి. ఇక ఇటీవల మారుతోన్నజీవన శైలి కారణంగా కంటి చూపుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరగడంతో కంటి సమస్యల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కంటి చూపును సహజంగా మెరుగు పరుచుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ కంటి చూపును మెరుగు పరిచే ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..
* కంటి చూపు ఆరోగ్యంలో విటమిన్ ఎ, సి, ఇలు ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విటమిన్‌లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా క్యారెట్లు, ఎరుపు రంగు క్యాప్సికం, బ్రొకొలి, పాలకూర, స్ట్రాబెర్రీలు, చిలగడదుంపలు, నిమ్మజాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.
* కంటిచూపు మెరుగుపరచడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజలు, బాదంపప్పు వంటి పదార్థాలు కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి.
* కోడిగుడ్లు కూడా కంటి చూపును మెరుగు పరుస్తాయి. ప్రతీ రోజూ ఉడకబెట్టిన ఒక గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా నిత్యం ఒక అలవాటుగా మార్చుకుంటే కంటి చూపు మెరుగువుతుంది.
* ఇక డయాబెటిస్ ఉన్న వారిలో కూడా కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు ముందు షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా జాగ్రత్తలు పడాలి.
* కంప్యూటర్‌ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి కూడా కంటి సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు 20-20-20 రూల్‌ని పాటించాలి. ఈ రూల్ ఏంటనేగా.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
* వీటన్నింటీతో పాటు సరిపడ నీరు తాగడం, నిద్ర, విశ్రాంతి తీసుకోవడం, యోగవంటివి చేయడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
Also Read: Viral Video: రెండు పులుల ఫైట్ ఎప్పుడైనా చూశారా !! వీడియో