Mediterranean Diet: ఈ ఆహారాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ డైట్‌గా గుర్తించిన శాస్త్రవేత్తలు

Mediterranean Diet:ప్రొటీన్స్‌ ఉన్న ఫుడ్‌ తీసుకుంటే అరోగ్యంగా ఉండడమే కాకుండా అనారరోగ్యం బారిన పడకుండా ఉంటాము. ఇక మెడిటరేనియన్‌..

Mediterranean Diet: ఈ ఆహారాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ డైట్‌గా గుర్తించిన శాస్త్రవేత్తలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2022 | 10:17 AM

Mediterranean Diet:ప్రొటీన్స్‌ ఉన్న ఫుడ్‌ తీసుకుంటే అరోగ్యంగా ఉండడమే కాకుండా అనారరోగ్యం బారిన పడకుండా ఉంటాము. ఇక మెడిటరేనియన్‌ డైట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ డైట్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఈ అవార్డును యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ అందజేస్తుంది. వివిధ డైట్లను పరిశీలించిన తరర్వాతనే అత్యుత్తమ డైట్‌గా ఎంపిక చేస్తారు. గత ఐదు సంవత్సరాలు అత్యుత్తమ డైట్‌గా ఎంపికవుతున్న మెడిటరేనియన్‌ డైట్‌ను అనుసరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గుండె జబ్బులు, గుండెపోటు, రొమ్ము క్యాన్సర్‌ వంటి వ్యాధులను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు. అలాగే బరువును త్వరగా తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.

మెడిటరేనియన్‌ డైట్‌ అంటే ఏమిటి..? మెడిటరేనియన్‌ డైట్‌ అనేది మొక్కల ఆధారిత ఆహారం. ఈ డైట్‌లో పండ్లు, కూరగాయలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, విత్తనాలు ఈ డైట్‌లో చేర్చారు. పచ్చి ఆలివ్ నూనెను కొవ్వుగా ఉపయోగిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు. ఈ ఆహారంలో చక్కెర, ఎర్ర మాంసం, గుడ్లు, చికెన్, టర్కీ చికెన్‌, పాల ఉత్పత్తులను చాలా తక్కువగా ఉపయోగిస్తారు.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: మెడిటరేనియన్‌ ఆహారం తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ వంటి గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. డిప్రెషన్‌ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో పోల్చుకుంటే ఈ ఆహారం తీసుకున్న వ్యక్తులకు 33 శాతం తక్కువ డిప్రెషన్‌కు గురవుతారని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ఈ డైట్‌ను ఫాలో అయ్యేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుపై సానుకకూల ప్రభావం చూపుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సు ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక వ్యాధుల నుంచి రక్షించడం లాంటికి ఈ డైట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎక్కువ కాలం జీవించవచ్చు: ఈ డైట్‌ కారణంగా మనిషి ఎక్కువ కాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీని కారణంగా జీవితంలో మనిషికి ఎక్కువ వ్యాధులు రాకుండా ఉంటాడు. అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. స్త్రీలలో కూడా ఎముకలు బలంగా మారుతాయి.

డయాబెటిస్‌ అదుపులో.. డయాబెటిస్‌ ఉన్నవారికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. టైప్‌ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచే విధంగా ఉపయోగపడుతుంది. అలాగే చిత్త వైకల్యం తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్‌కు .. ఈ ఆహారం రొమ్ము క్యాన్సర్‌ ఉన్నవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ ఆహారం తీసుకున్నవారిలో40 శాతం మందికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Diabetes Symptoms: మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? మధుమేహం కావచ్చు.. ముందుగానే గుర్తించండిలా..!

Vegetables Cleaning: కూరగాయలను సబ్బు, లిక్విడ్‌లతో శుభ్రం చేస్తున్నారా..? ప్రమాదమే.. ఇలా చేయండి..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!