AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee Health Benefits: నెయ్యి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Ghee Health Benefits: చాలా మంది నెయ్యి అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి...

Ghee Health Benefits: నెయ్యి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Jan 11, 2022 | 11:47 AM

Share

Ghee Health Benefits: చాలా మంది నెయ్యి అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే నెయ్యి రుచి, వాసనను పెంచడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యితో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్‌ ఉన్నాయని అంటున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

నెయ్యితో రోగనిరోధక శక్తి: నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి పెంచడంలో కీలక పాత్ర: నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి చర్మం, జుట్టుకు ప్రకాశాన్ని తెస్తుంది.

బరువు తగ్గించుకునేందుకు.. అలాగే, నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ వివరాలను అందిస్తున్నాము. ఏదైనా సందేహాలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించండి)

ఇవి కూడా చదవండి:

Mediterranean Diet: ఈ ఆహారాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ డైట్‌గా గుర్తించిన శాస్త్రవేత్తలు

Health: మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? అయితే మీ శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేన‌ట్లే..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...