Health: మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? అయితే మీ శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేన‌ట్లే..

Health: మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరమంతా ర‌క్త స‌ర‌ఫ‌రా సాఫీగా సాగాలి. ర‌క్తం స‌ర‌ఫ‌రా అవ్వ‌డం వ‌ల్లే ఆక్సిజ‌న్ శ‌రీంలోని అన్ని భాగాల‌కు వెళుతుంది. దీంతో శ‌రీరంలోని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేసి..

Health: మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? అయితే మీ శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేన‌ట్లే..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2022 | 10:17 AM

Health: మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరమంతా ర‌క్త స‌ర‌ఫ‌రా సాఫీగా సాగాలి. ర‌క్తం స‌ర‌ఫ‌రా అవ్వ‌డం వ‌ల్లే ఆక్సిజ‌న్ శ‌రీంలోని అన్ని భాగాల‌కు వెళుతుంది. దీంతో శ‌రీరంలోని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేసి అన్ని క్రియ‌లు సాఫీగా సాగుతాయి. అయితే కొన్ని సంద‌ర్భాల్లో శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు ఏర్ప‌డుతుంటాయి. దీనివ‌ల్ల శ‌రీరంలో కొన్ని మార్పులు జ‌రుగుతుంటాయి. ఇంత‌కీ ర‌క్త స‌ర‌ఫరా సరిగా లేక‌పోతే ఎలాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..

* కాళ్ల‌కు ర‌క్తం స‌రిగా ప్ర‌స‌ర‌ణ కాక‌పోతే కాళ్ల‌లో ఉండే న‌రాలు ప‌ట్టేసిన‌ట్లు అనిపిస్తాయి. ఇక కొంద‌రిలో కాళ్లు ఉబ్బుతాయి. మ‌రికొంద‌రిలో కాళ్ల‌లో స్ప‌ర్శ కూడా ఉండ‌దు. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కాళ్ల‌లో ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌రిగ్గా అవ్వ‌ట్లేద‌ని గుర్తించాలి.

* ఇక మెదడుకు నిత్యం ర‌క్తం స‌ర‌ఫ‌రా జ‌రిగితేనే అన్ని ప‌నులు సక్ర‌మంగా సాగుతుంటాయి. మెదడుకు ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంది, త‌ర‌చూ త‌ల‌నొప్పి, బ‌ద్ద‌కంగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

* కిడ్నీల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌క‌పోతే కిడ్నీలు వాపున‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. దీనివ‌ల్ల మూత్రం రంగులో మార్పు క‌నిపించ‌డం, మూత్రం దుర్వాస‌న రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

* ఇక కాలేయానికి కూడా ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే ప‌లు ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు, ఆక‌లి స‌రిగ్గా ఉండ‌దు, కొన్ని సంద‌ర్భాల్లో చ‌ర్మం రంగు మారుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే..కాలేయానికి ర‌క్తం అంద‌డం లేద‌ని గ‌మనించాలి.

* పైన తెలిపిన ల‌క్ష‌ణాల్లో ఏవీ క‌నిపించినా ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి, వైద్యుల సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఇక కొన్నిసంద‌ర్భాల్లో శ‌రీరంలో ర‌క్తం స్థాయి త‌గ్గినా ఇలాంటి స‌మస్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ర‌క్తాన్ని పెంచే ఆహారాన్ని అల‌వాటు చేసుకోవాలి.

Also Read: Viral Video: వామ్మో.. రోడ్డుకు అడ్డంగా భారీ ఫైథాన్.. చూసి హడలెత్తిపోయిన వాహనదారులు.. ఏం చేశారంటే..?

BJP PREPARATION: అన్ని పార్టీలు ఒకవైపు.. ఒక్క బీజేపీ ఒకవైపు.. అయిదు రాష్ట్రాల ఎన్నికలకు కాషాయదళం సంసిద్ధం

Telangana Rains: ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..