Telangana Rains: ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..
Heavy Thunderstrom Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ
Heavy Thunderstrom Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడం, వాయువ్య ప్రాంతంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా పిడుగులు, ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని హెచ్చరించింది.
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ (నర్సాపూర్), శామీర్‌పేటతోపాటు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పిడుగులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. వీటితోపాటు సిరిసిల్ల, కరీంనగర్, జనగాం జిల్లాల్లో కూడా పిడుగులు పడే అవకాశముంది. ఈ రోజు రాత్రికి హైదరాబాద్‌లో కూడా అక్కడక్కడ ఉరుములు పడే అవకాశముందని పేర్కొంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.
Also Read: