AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wifes Swap: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటలు పరస్పరం భార్యలను మార్చుకుంటూ సెక్స్ కార్యకలాపాలు...

Wifes Swap: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..
Wife Swap
Ravi Kiran
|

Updated on: Jan 10, 2022 | 4:42 PM

Share

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటలు పరస్పరం భార్యలను మార్చుకుంటూ సెక్స్ కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంలో కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న ఈ భార్యల స్వాపింగ్ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ రాకెట్‌లో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మితిమీరిన లైంగిక కోర్కెలతో ఓ భర్త తన భార్యను మరొకరితో స్వాప్ చేయడానికి యత్నించగా.. సదరు మహిళ మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్వాపింగ్ బృందంలో 1000 మంది జంటలకు సభ్యత్వం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కేరళ రాష్ట్రమంతా ఈ భార్యల మార్పిడి రాకెట్ సాగుతోందని చంగంచెరి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ తెలిపారు. సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా ఈ బాగోతాన్ని కొనసాగిస్తున్నారని డీస్పీ అన్నారు. ఈ వ్యవహారంలో పలువురు ఉన్నత కుటుంబాలకు చెందినవారు, ధనికులు సైతం ఉన్నట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. ఈ రాకెట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశామని.. మరో 25 మందిపై నిఘా ఉంచినట్లు డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ వెల్లడించారు.

గతంలోనూ ఇలాంటి నేరాలు..

2012లో కేరళలోని కొచ్చిలో భారత నేవీ అధికారులు వైఫ్ స్వాపింగ్ పార్టీ చేసుకున్నట్లు వచ్చిన ఓ వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఓ నేవీ ఆఫీసర్ తన భార్యను వేరే వ్యక్తితో శృంగారానికి ఒత్తిడి చేస్తే.. అందుకు అంగీకరించని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

కాగా, గతంలోనూ కేరళలోని అలప్పుజ, కయం కులమ్ జిల్లాల్లో కూడా ఇలాంటి భార్యల స్వాపింగ్ కేసులు నమోదయ్యాయి. షేర్‌చాట్ ద్వారా పరిచయమైన ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఈ వ్యవహారం చైన్ సిస్టంలా విస్తరించింది. ఇక్కడా ఓ మహిళ తిరస్కరించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన బహిర్గతం అయింది. ఈ వ్యవహారంలో ఐపీసీ, 354, 366, 376 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత