Rajnath Singh: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా..
Defence Minister Rajnath Singh: దేశంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ
Defence Minister Rajnath Singh: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నర దాటాయి. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారిన పడ్డారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిపిన పరిక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ ద్వారా వెల్లడించారు.
తేలికపాటి లక్షణాలు కనిపించగా.. ఈరోజు పరీక్షలు చేయించుకున్నానని.. ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల తన కాంటాక్ట్ పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఐసోలేషన్‌లో ఉండాలని..పరీక్షలు చేయించుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ అభ్యర్థించారు.
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు) 1,79,723 మందికి కోవిడ్ సోకింది. కరోనా వల్ల ఒక్కరోజు వ్యవధిలో మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: