Delhi: దేశ రాజధానిలో రెడ్ అలెర్ట్.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నగరంలో మరిన్ని ఆంక్షలు

Coronavirus in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. థర్డ్ వేవ్‌లో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ హెల్త్ వర్కర్లు, పోలీసులు, డాక్టర్లను

Delhi: దేశ రాజధానిలో రెడ్ అలెర్ట్.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నగరంలో మరిన్ని ఆంక్షలు
Delhi Corona
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 10, 2022 | 3:37 PM

Coronavirus in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. థర్డ్ వేవ్‌లో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ హెల్త్ వర్కర్లు, పోలీసులు, డాక్టర్లను పట్టిపీడిస్తోంది. ఢిల్లీలోని 6 ప్రముఖ ఆస్పత్రుల్లోని 700 మంది పైగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పోలీసు సిబ్బందిలో బాధితుల సంఖ్య 1,000కి పైగా చేరిందది. దీంతోపాటు పార్టమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 400 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పెద్ద సంఖ్యలో జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రతినిధులకు సైతం కరోనా సోకింది. ఈ నేపథ్యంలోు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అత్యవసర సమావేశమైంది. దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు నగరంలో మరిన్ని ఆంక్షలను విధించనున్నట్లు తెలిపింది. తాజా పరిస్థితుల దృష్ట్యా బార్లు, రెస్టారెంట్లను పూర్తిగా మూసేసే అవకాశం కనిపిస్తోంది. కేవలం టేక్ అవే (ఫుడ్ డెలివరీ)కి మాత్రమే అనుమతించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. 700 మంది పార్లమెంట్ సిబ్బంది కి కరోనా సోకడంతో ఈనెల 31 నుంచి జరగాల్సిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై సందిగ్ధత నెలకొంది. 7 గురు సుప్రీంకోర్టు న్యాయవాదులు, 250 మంది సిబ్బందికి కరోనా సోకడంతో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కేవలం ముఖ్యమైన కేసులు మాత్రమే విచారణ చేపడుతున్నారు. ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్ బ్రాంచ్) సహా 300 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది కోవిడ్-19 కు పాజిటివ్ కు గురయ్యారు. పోలీసు సిబ్బందిలో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) జారీ చేశారు.

ఢిల్లీ పోలీసు విభాగంలో మొత్తం 80,000 సిబ్బంది ఉన్నారు. SOP ప్రకారం, పోలీసు సిబ్బంది అందరూ ఫేస్-మాస్క్‌లు ధరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, వారి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సరైనవిధంగా చేతుల పరిశుభ్రతను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా.. రాజధానీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ ‘మీడియా సెంటర్’ మూసివేసే దిశగా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

Also Read:

Covid-19: రోజూవారి కేసుల సంఖ్య 8 లక్షలకు చేరొచ్చు.. అప్రమత్తత అత్యవసరం.. వైద్య నిపుణుల హెచ్చరిక

UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అవతార పురుషుడు పరశురాముడి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు..!