AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla: ఆ అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. ఉసిరిని అస్సలు తినకూడదు.. అవేంటో మీరే తెలుసుకోండి..

Amla Side Effects: శీతాకాలంలో ఉసిరికాయ (Amla) ను ఆహారంలో చేర్చుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఇది శీతాకాలపు (Winter) సూపర్ ఫుడ్‌

Amla: ఆ అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. ఉసిరిని అస్సలు తినకూడదు.. అవేంటో మీరే తెలుసుకోండి..
Amla
Shaik Madar Saheb
|

Updated on: Jan 11, 2022 | 5:00 PM

Share

Amla Side Effects: శీతాకాలంలో ఉసిరికాయ (Amla) ను ఆహారంలో చేర్చుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఇది శీతాకాలపు (Winter) సూపర్ ఫుడ్‌ ఎందుకంటే దీనిలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. విటమిన్ల గురించి మాట్లాడితే.. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. కరోనావైరస్ (Coronavirus) ప్రారంభం నాటినుంచి విటమిన్ సి ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలిసేలా చేసింది. అందువల్ల, విటమిన్ సి పెంచుకునేందుకు ఉసిరిని తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఉసిరి దుష్ప్రభావాలతోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిలో దాగున్న పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. దీంతోపాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇది చాలా మందికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, వారికి హాని కూడా కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉసిరిని ఎలాంటి వ్యక్తులు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్త సంబంధిత సమస్యలు.. ఉసిరిలో యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు. ఉసిరికాయ వినియోగం సాధారణ ప్రజలకు మంచిది. ఎందుకంటే ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కానీ ఇప్పటికే రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఆమ్లా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు తమ ఆహారంలో ఉసిరిని చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

ఎసిడిటీ.. తరచుగా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ఉసిరి తినకుండా ఉండాలి. ముఖ్యంగా ఉరికాయ జామ్ వారికి చాలా హానికరం. ఉసిరి ఆమ్ల లక్షణాలతో పాటు, మన ఆహారంలో ఉండే మసాలాలు ఆమ్లతను మరింత పెంచుతాయి. అలాంటి వారు దీనిని తినాలనుకుంటే, ఒకసారి నిపుణుల సలహా తీసుకోవాలి.

డీ హైడ్రేషన్.. శరీరంలో (డీహైడ్రేషన్) నీటి కొరత ఉంటే ఉసిరిని తినకూడదు. ఇందులో ఉండే మూలకాలు శరీరంలో పొడిబారడానికి కారణమవుతాయని పేర్కొంటారు. మీరు ఉసిరి తినాలనుకుంటే, ఎక్కువ నీరు త్రాగాలని సూచిస్తున్నారు.

మలబద్ధకం ఆమ్లా కడుపుకు చాలా మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇందులో సరైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అయితే పరిమితికి మించి తీసుకుంటే పొట్టలోకి పీచు ఎక్కువగా వెళ్లడం వల్ల మలబద్ధకం సమస్య కూడా రావచ్చు. మీరు ఉసిరికాయను ఎక్కువగా తిన్నట్లయితే, ఎక్కువ నీరు తాగాలి. తరచుగా మలబద్ధకం సమస్య ఉన్నవారు ఆహారం నుంచి ఉసిరిని మినహాయించాలని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు.

Also Read:

Ghee Health Benefits: నెయ్యి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Health: కంటి చూపు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా.? అయితే ఈ చిట్కాలు పాటించండి.. వెంట‌నే ఫ‌లితం..