Curd Side Effects: పెరుగుతో కలిపి ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. తింటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఎందుకంటే..
పెరుగు... ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు ఉండడం కామన్. పెరుగులో విటమిన్లు,
పెరుగు… ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు ఉండడం కామన్. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్, కొవ్వులు ఉంటాయ. ఇది శరీరానికి మేలు చేస్తుంది. కానీ కొన్నిసార్లు పెరుగుతో కూడా ఆనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి అస్సలు తీసుకోవద్దు. అలా తీసుకుంటే ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.
పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకోవడం వలన అలెర్జీ, గ్యాస్, అసిడిటీ, వాంతులు కూడా కలుగుతాయి. ఇందుకు కారణం పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ వేడిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పెరుగుతో కలిపి ఉల్లిపాయలను అస్సలు తీసుకోవద్దు. అలాగే పెరుగుతో కలిపి చేపలను తినకూడదు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీతోపాటు అజీర్తి కూడా వస్తుంది. అందుకే పెరుగుతోపాటు చేపలను అస్సలు తీసుకోవద్దు.
పెరుగుతోపాటు మామిడికాయను కలిపి తీసుకోవద్దు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన వాంతులు, కడుపు, చర్మ సంబంధిత సమస్యలు కలుగుతాయి. అందుకే మామిడితో కలిపి పెరుగును తీసుకోవద్దు. ఉరద్ పప్పుతో కలిపి పెరుగు తినకూడదు. దీనిని పెరుగుతోపాటు తీసుకోవడం వలన గ్యాస్ మరియు అసిడిటీ కాకుండా, ఉబ్బరం మరియు లూజ్ మోషన్ సమస్యలు కూడా ఉండవచ్చు. పెరుగు పాలు కలిపి తీసుకోవద్దు. ఇవి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుంది. దీంతో ఎసిడీటీ సమస్యలు వస్తాయి. పెరుగు, పాలు కలిపి తీసుకోవడం వలన వాంతులు అవుతాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి తీసుకోవద్దు.
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..