కరోనా సమయంలో పసుపు అధికంగా వాడుతున్నారా..! జాగ్రత్త శరీరంపై ఈ దుష్ప్రభాలు..

Turmeric Side Effects: పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు

కరోనా సమయంలో పసుపు అధికంగా వాడుతున్నారా..! జాగ్రత్త శరీరంపై ఈ దుష్ప్రభాలు..
Turmeric
Follow us
uppula Raju

|

Updated on: Jan 11, 2022 | 3:59 PM

Turmeric Side Effects: పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ఎలాంటి వ్యక్తులు తినకూడదో, దాని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏంటో తెలుసుకుందాం.

1. ఉదర సమస్యలు వాస్తవానికి పసుపుని వేడిగా పరిగణిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇది కడుపులో మంటతో పాటు విరేచనాలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు కడుపులో వాపు లేదా తిమ్మిరి సంభవిస్తుంది. కాబట్టి పసుపును ఎల్లప్పుడూ పరిమితంగా తీసుకోవాలి. అలాగే కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా పసుపు తినకూడదు. ఒకవేళ తింటే కామెర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

2. చర్మ సమస్యలు మీరు పరిమితికి మించి పసుపును తీసుకుంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతాయి. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. పసుపు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో ఉపయోగించడం ఉత్తమం. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

3. రాళ్లు ఉన్నవారికి మంచిది కాదు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపు తీసుకోవడం మంచిది కాదు. పసుపులో ఉండే మూలకాలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా పసుపు తీసుకోవడం మంచిది కాదు.

4. ముక్కు నుంచి రక్తం వచ్చేవారికి ముక్కు నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడాన్ని అధికంగా చేస్తుంది. అందుకే పరిమిత పరిమాణంలో పసుపును ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి.

గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు దీనికి బాధ్యత వహించదు. మీరు ఇందులో ఏదైనా పాటించేముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది.

IARI Recruitment: నిరుద్యోగులకు గమనిక.. పదో తరగతి అర్హతతో టెక్నీషియన్‌ పోస్టులు.. గడువు తేదీ పొడగింపు..

పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన భరించలేరు.. ఆ సమయంలో సింపుల్‌గా ఇలా చేయండి..

Makar Sankranti 2022: సంక్రాంతి స్పెషల్‌.. నువ్వులు, బెల్లం లడ్డూలు.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మేలు