AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti 2022: సంక్రాంతి స్పెషల్‌.. నువ్వులు, బెల్లం లడ్డూలు.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మేలు

Makar Sankranti 2022: సంక్రాంతి పండుగ రాబోతోంది. ఆ రోజు బెల్లం నువ్వులతో చేసిన లడ్డులు తినడం ఆనవాయితీ. అంతేకాదు ఆరోగ్యపరంగా

Makar Sankranti 2022: సంక్రాంతి స్పెషల్‌.. నువ్వులు, బెల్లం లడ్డూలు.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మేలు
Sesame Jaggery
uppula Raju
|

Updated on: Jan 11, 2022 | 2:51 PM

Share

Makar Sankranti 2022: సంక్రాంతి పండుగ రాబోతోంది. ఆ రోజు బెల్లం నువ్వులతో చేసిన లడ్డులు తినడం ఆనవాయితీ. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా ఈ లడ్డూలు చాలా మంచివి. చలికాలంలో బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో రక్తానికి లోటు ఉండదు. శారీరక బలహీనత తొలగిపోయి జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ లడ్డూలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వాటిని తయారు చేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. సులువుగా తయారుచేసుకోవచ్చు. అయితే ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు నువ్వుల లడ్డూలు తయారుచేయడానికి మీకు 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల నువ్వులు, రెండు చెంచాల బాదం, రెండు చెంచాల జీడిపప్పు, రెండు చెంచాల నెయ్యి, 4 నుంచి 5 యాలకులు అవసరం.

ఎలా తయరు చేయాలి.. 1. ముందుగా నువ్వులను శుభ్రంగా కడిగి బాణలిలో వేసి మీడియం మంటపై వేయించాలి. లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలని గుర్తుంచుకోండి.

2. వాటిని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చండి. తరువాత సగం నువ్వులను వేరు చేసి వాటిని మిక్సీలో వేసి ముతకగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన నువ్వుల పేస్ట్‌ని మిగతా నువ్వులలో వేసి కలపాలి.

3. ఇప్పుడు ఒక పాన్‌లో టేబుల్ స్పూన్ వెన్నను వేడి చేయాలి. అది కరిగాక అందులో బెల్లం వేసి కరిగించాలి. తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పులను చిన్న ముక్కలుగా కోసి వేయాలి. యాలకుల పొడి కూడా వేయాలి.

4. తర్వాత ఈ మిశ్రమాన్ని నువ్వులలో వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని నిమ్మకాయ సైజులో గుండ్రని లడ్డూలను సిద్ధం చేయాలి.

5. అలా చేసిన తర్వాత వాటిని 4 నుంచి 5 గంటల పాటు ఆరనివ్వాలి. తరువాత ఇవి గట్టిపడుతాయి. అప్పుడు వాటిని గాలి చొరబడని కంటైనర్ పెట్టి నిల్వ చేయాలి. చాలా కాలం తాజాగా ఉంటాయి.

IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: సిరీస్‌ డిసైడర్ టెస్ట్‌లో విజయం ఎవరిదో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్

మీరు ఈ విషయాలలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవచ్చు..! కానీ ఇవి చాలామందికి తెలియదు..

షాకింగ్‌.. మాస్కు ఎందుకు పెట్టుకోలేదని అడిగినందుకు పిస్టల్‌తో కాల్పులు..