IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా 17/1

IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: భారత్, దక్షిణాఫ్రికా (India Vs South Africa) జట్ల మధ్య కేప్ టౌన్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ నేడు (Cape Town Test) ప్రారంభమైంది. ప్రస్తుతం ఇరు జట్లు సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి.

IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: తొలిరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా 17/1
Ind Vs Sa, 3rd Test

IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్ 8 పరుగులు, కేశవ్ మహారాజ్ 6 పరుగులతో నిలిచారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్ కంటే సౌతాఫ్రికా 206 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్‌ రాహుల్ నిరాశపరిచారు.

త్వరగానే ఔట్‌ కావడంతో జట్టు బాధ్యతలు కెప్టెన్ కోహ్లీ, పూజారా తీసుకున్నారు. నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుని పెంచారు. ఈ క్రమంలో పుజారా 77 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అజింకా రహానె 9 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌తో కలిసి కోహ్లీ ఐదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 27 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 201 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్‌తో 79 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 77.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 4, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1, ఎంగిడి 1 వికెట్‌ సాధించారు.

ఇరుజట్ల ప్లేయింగ్ XI: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎంగిడి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 11 Jan 2022 21:46 PM (IST)

  తొలిరోజు ముగిసన ఆట

  సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలిరోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్ 8 పరుగులు, కేశవ్ మహారాజ్ 6 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు భారత్ 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్ కంటే సౌతాఫ్రికా 206 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది.

 • 11 Jan 2022 21:17 PM (IST)

  తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

  సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. డీన్‌ ఎల్గర్ 3 పరుగులకు ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పుజారా క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేసింది. కేశవ్‌ మహరాజ్ క్రీజులోకి వచ్చాడు.

 • 11 Jan 2022 20:57 PM (IST)

  బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా

  పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా. ఓపెనర్లుగా కెప్టెన్ డీన్ ఎల్గర్, మాక్రమ్‌ క్రీజులోకి వచ్చారు.

 • 11 Jan 2022 20:46 PM (IST)

  భారత్‌ 223 పరుగులకు ఆలౌట్‌

  సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఒంటి చేత్తో పోరాడాడు. పూజారా మినహాయించి ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. దీంతో భారత్ 77.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 79 పరుగులు, పుజారా 43 పరుగులు మిగతా వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 4, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1, ఎంగిడి 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 20:25 PM (IST)

  తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. విరాట్‌ కోహ్లీ 79 పరుగులకు ఔటయ్యాడు. రబడ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ 9 తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 4, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 20:15 PM (IST)

  ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా 0 పరుగులకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో కెప్టెన్ ఎల్గర్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 20:03 PM (IST)

  ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. శార్దుల్‌ ఠాగూర్ 12 పరుగులకు ఔటయ్యాడు. మహారాజ్‌ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 20:02 PM (IST)

  200 పరుగులు దాటిన భారత్

  భారత్ 67 ఓవర్లలో 200 పరుగులు దాటింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ 73 పరుగులు, శార్దుల్‌ ఠాగూర్ 12 పరుగులతో ఆడుతున్నారు. దీంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, జాన్సన్ 3, ఓలివర్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 19:42 PM (IST)

  ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 2 పరుగులకు ఔటయ్యాడు. జాన్సన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, జాన్సన్ 3, ఓలివర్ 1 వికెట్‌ సాధించారు. క్రీజులోకి శార్దుల్ ఠాగూర్ వచ్చాడు.

 • 11 Jan 2022 19:30 PM (IST)

  ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రిషబ్‌ పంత్‌ 27 పరుగులకు ఔటయ్యాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో పీటర్సన్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, జాన్సన్2, ఓలివర్ 1 వికెట్‌ సాధించారు. క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు.

 • 11 Jan 2022 19:28 PM (IST)

  50 పరుగుల భాగస్వామ్యం

  కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌లు కలిసి ఐదో వికెట్‌కి 110 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. విరాట్‌ కోహ్లీ 50 పరుగులు, రిషబ్ పంత్ 27 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

 • 11 Jan 2022 19:27 PM (IST)

  హాఫ్ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లీ

  కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో 28వ హాఫ్ సెంచరీ సాధించాడు. 158 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో భారత్ 4 వికెట్ల నష్టానికి167 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 27 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు.

 • 11 Jan 2022 19:08 PM (IST)

  150 పరుగులు దాటిన భారత్

  భారత్ 55.5 ఓవర్లలో 150 పరుగులు దాటింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ 46 పరుగులు, పంత్ 16 పరుగులతో ఆడుతున్నారు. దీంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, ఓలివర్ 1 వికెట్‌, జాన్సన్ 1 వికెట్ సాధించారు.

 • 11 Jan 2022 18:45 PM (IST)

  టీ బ్రేక్ సమయానికి ఇండియా 141/4

  సౌతాఫ్రికా, భారత్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కాగా సెకండ్‌ సెషన్‌లో మరో రెండు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 40 పరుగులు, రిషబ్ పంత్‌ 12 పరుగులతో నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, ఓలివర్ 1 వికెట్‌, జాన్సన్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 17:48 PM (IST)

  నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. అజింకా రహానె 9 పరుగులకు ఔటయ్యాడు. రబాడా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 2, ఓలివర్ 1, జాన్సన్1 వికెట్‌ సాధించారు. క్రీజులోకి రిషబ్‌ పంత్‌ వచ్చాడు.

 • 11 Jan 2022 17:28 PM (IST)

  100 పరుగులు దాటిన భారత్

  భారత్ 38.1 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ 19 పరుగులు, అజింకా రహానె 4 పరుగులతో ఆడుతున్నారు. దీంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 1, ఓలివర్ 1 వికెట్‌, జాన్సన్ 1 వికెట్ సాధించారు.

 • 11 Jan 2022 17:23 PM (IST)

  మూడో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ మూడో వికెట్‌ కోల్పోయింది. చటేశ్వర పుజారా 43 పరుగులకు ఔటయ్యాడు. జాన్సన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 1, ఓలివర్ 1, జాన్సన్1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 16:15 PM (IST)

  లంచ్‌ బ్రేక్ సమయానికి భారత్ 75/2

  సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ మొదటగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. లంచ్‌ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 15 పరుగులు, చటేశ్వర పుజారా 26 పరుగులతో నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 1, ఓలివర్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 15:33 PM (IST)

  50 పరుగులు దాటిన భారత్

  భారత్ 20 ఓవర్లలో 50 పరుగులు దాటింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ 4 పరుగులు, చటేశ్వర పుజారా 17 పరుగులతో ఆడుతున్నారు. దీంతో భారత్ 2 వికెట్ల నష్టానికి పరుగులు 52 చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 1, ఓలివర్ 1 వికెట్‌ సాధించారు.

 • 11 Jan 2022 14:53 PM (IST)

  రెండో వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ రెండో వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ అగర్వాల్ 15 పరుగులకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులోకి కెప్టెన్ విరాట్‌ కోహ్లీ వచ్చాడు.

 • 11 Jan 2022 14:48 PM (IST)

  తొలి వికెట్‌ కోల్పోయిన భారత్

  భారత్ మూడో టెస్ట్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. కెఎల్‌ రాహుల్ 12 పరుగులకు ఔటయ్యాడు. ఓలివర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఒక వికెట్‌ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజులోకి పూజారా వచ్చాడు.

 • 11 Jan 2022 14:07 PM (IST)

  బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇండియా

  సౌతాఫ్రికా, భారత్‌ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ మొదటగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. క్రీజులోకి ఓపెనర్లుగా కెఎల్‌ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ వచ్చారు. తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ 6 పరుగులు చేసింది.

 • 11 Jan 2022 14:05 PM (IST)

  టీమిండియా బ్యాటింగ్ మొదలు

  టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు.

 • 11 Jan 2022 13:45 PM (IST)

  IND vs SA 3rd Test: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్

  టీమిండియా ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

 • 11 Jan 2022 13:45 PM (IST)

  IND vs SA 3rd Test: దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్

  దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎంగిడి.

 • 11 Jan 2022 13:41 PM (IST)

  Happy Birthday Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు..

  భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేడు పుట్టినరోజు చేసుకోనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో రాణించి కోచ్‌కి అత్యుత్తమ బహుమతి ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. రాహుల్‌కి బీసీసీఐ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది.

 • 11 Jan 2022 13:39 PM (IST)

  భారత్ టాస్ గెలిచింది..

  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. హనుమ విహారి స్థానంలో కోహ్లి, గాయపడిన సిరాజ్ స్థానంలో ఉమేష్ యాదవ్‌కు ప్లేయింగ్-11లో అవకాశం లభించింది.

Published On - 1:35 pm, Tue, 11 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu