SA vs IND: సిరీస్ డిసైడర్ మ్యాచులో కోహ్లీ అలా చేస్తే మంచిది: హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న విరాట్ మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు.

SA vs IND: సిరీస్ డిసైడర్ మ్యాచులో కోహ్లీ అలా చేస్తే మంచిది: హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jan 11, 2022 | 12:59 PM

India vs South Africa: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో, చివరి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సెంచరీ కరువును ముగించగలడని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను 1-1తో సమంచేసింది. కోహ్లి వెన్నునొప్పి నుంచి కోలుకున్న తర్వాత మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. భారత టెస్టు కెప్టెన్ గత రెండేళ్లుగా రెడ్ బాల్ క్రికెట్‌లో ఫాంలో లేడు. అతను రెండేళ్లకు పైగా అంతర్జాతీయ సెంచరీ సాధించలేదు. కోల్‌కతాలో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ చివరి సెంచరీ సాధించాడు.

“మూడో టెస్టులో విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. ఈ మ్యాచ్‌లో అతని సెంచరీ కరవు తీరుతుందని నేను ఆశిస్తున్నాను. కోహ్లీ నుంచి సెంచరీని చూసి చాలా కాలం అయ్యింది” అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ విమర్శల గురించి తాను అస్సలు బాధపడనని చెప్పుకొచ్చాడు.

“ప్రజలు నా ఫామ్ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. నా కెరీర్‌లో ఇది చాలా సార్లు జరిగింది. 2014లో ఇంగ్లండ్ అలాంటి దశల్లో ఒకటిగా నిలిచింది. బయటి ప్రపంచం చూసే దాంట్లో నుంచి నన్ను నేను చూసుకోను. నా ప్రమాణాలు నేనే సెట్ చేసుకుంటాను. అవి బయటి ప్రపంచం నుంచి వచ్చినవి కావు. అందరికంటే ఎక్కువగా, జట్టు కోసం ఉత్తమంగా చేయడంలో, జట్టు కోసం క్రమం తప్పకుండా ప్రదర్శన చేయాలనుకోవడంలో నేను చాలా గర్వపడుతుంటాను’ అని కోహ్లీ సోమవారం పేర్కొన్నాడు. అయితే అనుభవజ్ఞులైన అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా భారీ స్కోర్లు సాధిస్తారని హర్భజన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

“అతనితో పాటు పుజారా, రహానేతోపాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు మరోసారి తమ సత్తాను చాటుతారని ఆశిస్తున్నాను. వారు 50 పరుగులు చేశారు. కానీ, వారు దానిని సెంచరీలుగా మారుస్తారని నేను ఆశిస్తున్నాను” అని హర్భజన్ జోడించాడు. జోహన్నెస్‌బర్గ్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానే ఇద్దరూ అర్ధసెంచరీలతో ఫామ్‌లోకి తిరిగి వచ్చే సంకేతాలిచ్చారు.

“పుజారా, రహానెల ఎంపికపై సందేహాలు కొంచెం తగ్గాయి. ఎందుకంటే ఇద్దరూ తమ అర్ధ సెంచరీల కోసం అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు దానిని సెంచరీలుగా మార్చలేకపోయారు. కానీ, ఇవి ముఖ్యమైన నాక్స్ అయినందున, మూడో టెస్టులో ఆడతారని నేను భావిస్తున్నాను” అని హర్భజన్ తెలిపాడు.

Also Read: Watch Video: చివరి మ్యాచ్‌లో చివరి బంతికి వికెట్ తీసి రిటైర్మెంట్.. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన వీడ్కోలు.. ఎవరంటే?

Rahul Dravid Birthday: ఈ 5 స్పెషల్ రికార్డులు రాహుల్‌ ద్రవిడ్‌కే సొంతం.. అవేంటంటే?