Watch Video: చివరి మ్యాచ్‌లో చివరి బంతికి వికెట్ తీసి రిటైర్మెంట్.. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన వీడ్కోలు.. ఎవరంటే?
Ross Taylor Retire: రాస్ టేలర్ (Ross Taylor) టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. క్రైస్ట్‌చర్చ్ (Christchurch Test)లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా నిలిచింది.
Ross Taylor: రాస్ టేలర్ (Ross Taylor) టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. క్రైస్ట్‌చర్చ్ (Christchurch Test)లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా నిలిచింది. ఇందులో కివీస్ విజయం సాధించడంతో ఈ దిగ్గజ ప్లేయర్‌కు ఘనంగా వీడ్కోలు పలికినట్లు అయింది. ఈ మ్యాచ్ ద్వారా రాస్ టేలర్ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడం చాలా అద్భుతంగా ఉంది. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీలో అతని పేరు ఎప్పటికీ నమోదయ్యేలా చేసుకున్నాడు. ఇలాంటి పేజీలో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే చేరారు. ఈ జాబితాలో చేరిన రెండో కివీ ఆటగాడిగా రాస్ టేలర్ నిలిచాడు. తన కెరీర్ చివరి టెస్టులో రాస్ టేలర్ వీడ్కోలు అద్భుతంగా, ఉల్లాసంతోపాటు చిరస్మరణీయంగా సాగింది.
క్రైస్ట్‌చర్చ్ టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 9 వికెట్లు పడగొట్టింది. వాగ్నర్, జేమీసన్, సౌతీ, బౌల్ట్ ఇలా కీలక బౌలర్లందరూ వికెట్లు తీశారు. ఇలాంటి పరిస్థితిలో చివరి వికెట్ విషయానికి వస్తే, అనుభవజ్ఞుడైన బౌలర్ టిమ్ సౌథీ, కెప్టెన్ టామ్ లాథమ్‌తో సంప్రదించి, రాస్ టేలర్‌కు బంతిని అందించాడు. తన టెస్ట్ కెరీర్‌కు వికెట్‌తో సెల్యూట్ చేయాలనే ఉద్దేశ్యం ఒక్కటే దీని వెనుక కారణం. దీన్ని రాస్ టేలర్ కూడా పూర్తి చేసి ఘనంగా వీడ్కోలు పలికాడు.
చివరి టెస్టు చివరి బంతికి వికెట్.. మ్యాచ్ మొత్తంలో తన తొలి ఓవర్ వేసిన రాస్ టేలర్ మూడో బంతికే బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ఇబాదత్ హొస్సేన్ వికెట్ తీశాడు. దీంతో కివీస్ ఆటగాళ్లంతా టేలర్‌ను చుట్టుముట్టి అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ దృశ్యాన్ని చూసి స్టేడియంలో కూర్చున్న రాస్ టేలర్ భార్య, పిల్లలు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
112 టెస్టులాడి 3 వికెట్లు మాత్రమే తీశాడు.. ఇబాదత్ హొస్సేన్ వికెట్ రాస్ టేలర్.. టెస్ట్ కెరీర్‌లో ఇదే చివరి వికెట్‌గా నిలిచింది. ఇప్పటివరకు 112 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్.. కేవలం మూడవ వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీనికి ముందు, 11 సంవత్సరాల క్రితం 2011లో భారత్‌తో ఆడిన అహ్మదాబాద్ టెస్టులో చివరిసారిగా 2 వికెట్లు తీసుకున్నాడు. అందులో హర్భజన్, శ్రీశాంత్‌లను టేలర్ పెవిలియన్ చేర్చాడు. అంటే, టేలర్ ఇప్పటి వరకు తీసిన మూడు టెస్ట్ వికెట్లు ఆసియా బ్యాట్స్‌మెన్‌కు చెందినవే, అవి కూడా టెయిలెండర్లవే కావడం విశేషం.
ఈ లిస్టులో చేరిన మొదటి బ్యాట్స్‌మన్.. మ్యాచ్‌లో చివరి బంతికి వికెట్ తీసి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తొలి బ్యాట్స్‌మెన్, రెండో కివీస్, ప్రపంచంలో నాలుగో ఆటగాడిగా రాస్ టేలర్ నిలిచాడు. అతని కంటే ముందు, న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ హ్యాడ్లీ, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్‌లు ఇలాంటి వీడ్కోలు అందుకున్నారు. ఈ జాబితాలో చేరిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా టేలర్ గుర్తింపు పొందాడు. ఎందుకంటే రాస్ టేలర్ బౌలర్ కాదు, టెస్ట్ క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా మాత్రమే రాణిస్తుంటాడు.
In fading light at Hagley Oval, @RossLTaylor is on to bowl in his final Test match! #NZvBAN pic.twitter.com/WvzuJdHsqg
— BLACKCAPS (@BLACKCAPS) January 11, 2022
What a way to finish the Test! @RossLTaylor takes his THIRD Test wicket to finish the Test inside 3 days at Hagley Oval. We finish the series 1-1 with @BCBtigers. #NZvBAN pic.twitter.com/2GaL0Ayapr
— BLACKCAPS (@BLACKCAPS) January 11, 2022
Also Read: Rahul Dravid Birthday: ఈ 5 స్పెషల్ రికార్డులు రాహుల్ ద్రవిడ్‌కే సొంతం.. అవేంటంటే?