Watch Video: ‘కరోనా స్టైల్ వేడుక’ చూశారా.. నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న పాక్ బౌలర్ సెలబ్రేషన్స్..!

బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన తర్వాత చేతులు కడుక్కొని, ముసుగు ధరించి, సరికొత్తగా వేడుకలు చేసుకుని పాక్ బౌలర్ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Watch Video: 'కరోనా స్టైల్ వేడుక' చూశారా.. నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న పాక్ బౌలర్ సెలబ్రేషన్స్..!
Big Bash League Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 11, 2022 | 1:56 PM

Big Bash League: కరోనా దెబ్బకు అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. క్రికెట్‌లోనూ రూల్స్ చాలా మారాయి. అందుకు అనుగుణంగానే బయోబబుల్‌ వచ్చింది. మరి ఇలాంటి వాటికి అనుగుణంగానే ఓ బౌలర్ సెలబ్రేషన్స్ పద్థతిని మార్చేశాడు. తన సరికొత్త స్టైల్‌తో నెట్టింట్లో ఆకట్టుకుంటున్నాడు. పాకిస్తాన్ (Pakistan) బౌలర్ హారిస్ రౌఫ్ (Haris Rauf) ఇలాంటి కొత్త పద్ధతికి నాంది పలికాడు. కరోనా నుంచి రక్షించుకోవాలంటూ ఎక్కడ చూసినా అవే సందేశాుల వినిపిస్తున్నాయి. అందుకే ఇలా చేశాడేమో అంటూ నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఈ పాకిస్థానీ బౌలర్ వికెట్లు తీసి సంబరాలు చేసుకునే శైలి ప్రపంచానికి శానిటైజ్ చేసి చేతులు కడుక్కోవడమే కాకుండా మాస్క్‌లు ధరించమని సందేశాన్ని ఇస్తున్నాడు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ కరోనా స్టైల్ వేడుకలు చేసుకుని ఆశ్చర్యపరిచాడు. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ హారిస్ రౌఫ్ బ్యాట్స్‌మన్ వికెట్ పడగొట్టాడు. దీంతో సరికొత్తగా తన వేడుకలను ప్రదర్శించాడు. పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ కుర్టిస్ ప్యాటర్సన్ వికెట్ కీపర్ చేతిలో హారిస్ రవూఫ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌కు ఇది తొలి దెబ్బ.

ఈ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ 2 వికెట్లు తీశాడు.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వికెట్ కీపర్ లారీ ఇవాన్ 46 బంతుల్లో 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. హారిస్ రౌఫ్ మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున 2 వికెట్లు పడగొట్టి జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తీయడమే కాకుండా పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ నిక్ హాబ్సన్ క్యాచ్ పట్టాడు రౌఫ్. పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 12 ఫోర్లు.. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ మొత్తం 10 సిక్సర్లు, 12 ఫోర్లు బాదేశారు. జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ 26 బంతుల్లో అజేయంగా 46 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, ఫోర్లు ఉన్నాయి. రవూఫ్‌తో పాటు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాకు మెల్‌బోర్న్ స్టార్స్ నుంచి మరో వికెట్ లభించింది. మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఇప్పుడు 197 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉంది.

Also Read: IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: సిరీస్‌ డిసైడర్ టెస్ట్‌లో విజయం ఎవరిదో.. టాస్‌ గెలిచిన కోహ్లీసేన

SA vs IND: సిరీస్ డిసైడర్ మ్యాచులో కోహ్లీ అలా చేస్తే మంచిది: హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు