Watch Video: నాడు ధోనీ-కోహ్లీలను ఔట్ చేసి ఫేమస్ అయ్యాడు.. నేడు పప్పులమ్ముతూ షాకిచ్చిన పాక్ బౌలర్?

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ 2011, 2015 ప్రపంచకప్‌లలో మంచి ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికీ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉండిపోయాడు.

Watch Video: నాడు ధోనీ-కోహ్లీలను ఔట్ చేసి ఫేమస్ అయ్యాడు.. నేడు పప్పులమ్ముతూ షాకిచ్చిన పాక్ బౌలర్?
Pak Bowler Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 11, 2022 | 7:54 AM

Viral Video: ప్రపంచ కప్ 2011, మొహాలీలోని పీసీఏ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్ తన సత్తాను ప్రపంచం మొత్తానికి చూపించాడు. మొహాలీలో భారత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు పడగొట్టిన వహాబ్ రియాజ్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ జట్టు తరపున ఆకట్టుకున ఈ బౌలర్ ప్రస్తుతం జట్టులో లేడు. అయితే వాహబ్ రియాజ్.. వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞులను ఒకే విధంగా ఔట్ చేశాడు. ప్రపంచకప్‌లో సందడి చేసిన అదే పాక్ బౌలర్ సోమవారం పాకిస్థాన్ రోడ్డుపై వీధి వ్యాపారిగా మారి పప్పులు అమ్ముతూ కనిపించాడు.

ఆశ్చర్యపోకండి.. వాహబ్ రియాజ్ నిజంగా పప్పు అమ్మడంలేదు. వాస్తవానికి వహాబ్ రియాజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను పప్పు అమ్ముతున్నట్లు కనిపించాడు. వహాబ్ రియాజ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నాకు నా చిన్ననాటి రోజులు గుర్తున్నాయి, సరదాగా గడిచాయి అంటూ రాసుకొచ్చాడు.

వహాబ్ రియాజ్ బిగ్ టోర్నమెంట్ బౌలర్.. అయినా పాక్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఎప్పుడూ పెద్ద టోర్నమెంట్లలో మెరుస్తూనే ఉంటాడు. వాహబ్ రియాజ్ 2011 ప్రపంచ కప్‌లో ఆడిన 5 మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 5 పరుగుల కంటే తక్కువగా ఉంది. భారత్‌పై మాత్రమే తను తీసిని 8 వికెట్లలో 5 ఉన్నాయి.

వహాబ్ రియాజ్ 2015 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్‌కు కూడా పేరుగాంచాడు. ఆస్ట్రేలియాపై వాహబ్ రియాజ్ తన అద్భుతమైన బౌన్సర్‌తో బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. షేన్ వాట్సన్ ఈ పాక్ బౌలర్ బంతుల్లో ఆడటం అసాధ్యంగా మారింది. 2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో వహాబ్ 16 వికెట్లు పడగొట్టాడు. వహాబ్ డిసెంబర్ 2020 నుంచి పాక్ జట్టుకు దూరమయ్యాడు. 36 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ 27 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. 91 వన్డేల్లో 120 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, ఈ ఫాస్ట్ బౌలర్ 36 టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Watch Video: కోహ్లీ ప్రాక్టీస్‌తో కలత చెందిన ఫ్యాన్స్.. ఈ ఒక్కసారికి అలా చేయోద్దంటూ విజ్ఞప్తి..!

IPL 2022 Mega Auction: ఐపీఎల్ స్టార్లు ఆ రెండు జట్లలోనే.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా కోహ్లి ఫ్రెండ్.!