5

IPL 2022 Mega Auction: ఐపీఎల్ స్టార్లు ఆ రెండు జట్లలోనే.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా కోహ్లి ఫ్రెండ్.!

ఐపీఎల్ 2022 సీజన్‌లో అరంగేట్రం చేయనున్న రెండు కొత్త జట్లలో ఒకటైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ..

IPL 2022 Mega Auction: ఐపీఎల్ స్టార్లు ఆ రెండు జట్లలోనే.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా కోహ్లి ఫ్రెండ్.!
Virat Kohli
Follow us

|

Updated on: Jan 10, 2022 | 8:12 PM

ఐపీఎల్ 2022 సీజన్‌లో అరంగేట్రం చేయనున్న రెండు కొత్త జట్లలో ఒకటైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. తన జట్టు సారధిని దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను.. మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను తీసుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. పాండ్యాతో పాటుగా ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా ఆ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి జాతీయ మీడియాకి చెప్పినట్లుగా వినికిడి. గతంలో ఈ టీంకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కాబోతున్నట్లు వార్తలు నెట్టింట జోరుగా ప్రచారం జరిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి రావడంతో.. కెప్టెన్సీ చేపట్టాలనుకున్న శ్రేయాస్‌కు మరోసారి భంగపాటు ఎదురైనట్లే.

మరోవైపు అహ్మదాబాద్‌తో పాటు లక్నో ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేస్తోన్న విషయం విదితమే. ఈ ఫ్రాంచైజీ.. తమ జట్టుకు హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ను నియమించుకుంది. ఇంకా ఈ టీం కెప్టెన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోగా.. కెఎల్ రాహుల్‌ లక్నోకి సారధ్యం వహించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అటు డేవిడ్ వార్నర్‌, క్వింటన్ డికాక్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ రెండు కొత్త జట్లు మెగా ఆక్షన్‌కు ముందు ముగ్గురు ప్లేయర్స్ ఎంచుకునేందుకు జనవరి 31వ తేదీ డెడ్‌లైన్‌గా బీసీసీఐ విధించింది. చూడాలి మరి ఎవర్ని తీసుకుంటారో.. అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!