Watch Video: కోహ్లీ ప్రాక్టీస్‌తో కలత చెందిన ఫ్యాన్స్.. ఈ ఒక్కసారికి అలా చేయోద్దంటూ విజ్ఞప్తి..!
కేప్ టౌన్ టెస్టు కోసం విరాట్ కోహ్లి ప్రత్యేక సన్నాహాలు మొదలుపెట్టాడు. భారత కెప్టెన్ బ్యాటింగ్ వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.
India vs South Africa, 3rd Test: కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు (India vs South Africa, 3rd Test) మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీంకు సిరీస్ దక్కనుంది. అలాగే ప్రత్యేక రికార్డులు కూడా వస్తాయి. కాబట్టి ఇరు జట్లూ తమ సత్తా చాటబోతున్నాయి. మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమైంది. అయితే టీమ్ ఇండియాకు మాత్రం చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి కెప్టెన్ కోహ్లి తన సన్నాహాల్లో ఎటువంటి చిన్న తప్పును వదిలిపెట్టడం లేదు. విరాట్ కోహ్లీ సోమవారం చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. వేగవంతమైన బంతులు, అద్భుతమైన బౌన్సర్లు, స్వింగ్, ఔట్ స్వింగ్ ఇలా అన్ని బంతులను భారత కెప్టెన్ కొట్టేస్తూ కనిపించాడు. అయితే అతని బ్యాటింగ్ వీడియో చూసిన భారత అభిమానులు మాత్రం ఫిదా అవుతున్నారు. కేప్‌టౌన్‌లో టీమిండియాకు తిరుగులేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
BCCI అప్‌లోడ్ చేసిన వీడియోలో , విరాట్ కోహ్లీ ఆఫ్-స్టంప్ వెలుపల వెళ్తున్న బంతులపై స్ట్రోక్స్ ఆడుతున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత అభిమానులు దయచేసి బయటికి వెళ్లే బంతులను ఆడొద్దని, ఎటువంటి షాట్లు కొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరాట్ కోహ్లీ ఒకే రకంగా ఔటయ్యాడని తెలసిందే. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత విరాట్ అలాంటి షాట్లు ఆడడం కనిపించింది. ఆ తర్వాత అతని షాట్ ఎంపికపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ప్రాక్టీస్ సమయంలోనూ, ఆఫ్-స్టంప్ వెలుపలి బంతుల్లో విరాట్ కోహ్లీ షాట్లు ఆడినప్పుడు, అభిమానులు ఇలా కామెంట్లు చేస్తున్నారు.
కేప్ టౌన్ చేసిన తప్పును పునరావృతం చేయవద్దు విరాట్! కేప్‌టౌన్‌లో భారత్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. టీం ఇండియా 5 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయి 2 డ్రా అయ్యాయి. చివరిసారిగా కేప్‌టౌన్‌కు చేరుకున్న టీమిండియా 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసిన తర్వాత విరాట్ ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 209 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో విజయానికి 208 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా, టీమిండియా కేవలం 42.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది.
బ్యాట్స్‌మెన్ సత్తా చాటాలి.. టీమ్ ఇండియా బ్యాటింగ్ ఈసారి కూడా బలహీనంగానే కనిపిస్తోంది. ఈ సిరిస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 300కి పైగా స్కోర్లు నమోదవగా, భారత్‌లోని 2వ ర్యాంక్ నుంచి 6వ ర్యాంక్ వరకు ఉన్న బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన చేయడం పెద్ద విషయం. మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రిషబ్ పంత్ లు ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. జోహన్నెస్‌బర్గ్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా-రహానే హాఫ్ సెంచరీ సాధించారు. అయితే గత రెండేళ్లుగా ఈ ఆటగాళ్లు కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ చాలా ఇన్నింగ్స్‌లలో ఫ్లాప్‌గా నిరూపించుకుంటున్నారు. కాబట్టి కేప్‌టౌన్‌లో రహానే-పుజారాలను కూడా నమ్మలేం. కేప్‌టౌన్‌లో గెలవాలంటే బలహీనతను బలంగా మార్చుకోవడం అవసరం.
? ? ?
Practice ?
?? ??? ???? – ??????? ?????.? ?#TeamIndia | #SAvIND | @imVkohli pic.twitter.com/ChFOPzTT6q
— BCCI (@BCCI) January 10, 2022
Please don’t play drives for at least this match ?? leave all the balls outside off. Take some inspiration from Sachin’s memorable knoc from SCG. That’s how a champion come back. And you are world champion ? Good luck Captain ?
— Ashok. (@Rathodashu23) January 10, 2022
Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ స్టార్లు ఆ రెండు జట్లలోనే.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా కోహ్లి ఫ్రెండ్.!
క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్ ఇదేనేమో..! వరుసగా 10 ఇన్సింగ్స్‌ల్లో సున్నా పరుగులే..?