క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్‌ ఇదేనేమో..! వరుసగా 10 ఇన్సింగ్స్‌ల్లో సున్నా పరుగులే..?

uppula Raju

uppula Raju |

Updated on: Jan 10, 2022 | 3:26 PM

Cricket News: టెస్టు క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమవడం అనేది జరగుతూనే ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు పరుగులకే ఔటవడం

క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్‌ ఇదేనేమో..! వరుసగా 10 ఇన్సింగ్స్‌ల్లో సున్నా పరుగులే..?
Cricket News

Cricket News: టెస్టు క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమవడం అనేది జరగుతూనే ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు పరుగులకే ఔటవడం తరచుగా మీరు చూసే ఉంటారు. ఒక్కోసారి రెండంకెల స్కోరు చేయకముందే ఔటవుతారు. కానీ పది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగు కూడా చేయకుంటే ఎలా ఉంటుంది..? ఖాతా తెరవకపోతే ఏమంటారు.. బంగ్లాదేశ్ ఆటగాడు ఎబాడోత్ హుస్సేన్ విషయంలో ఇదే జరిగింది. టెస్టు క్రికెట్‌లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఇబాదత్ హొస్సేన్ ఒక్క పరుగు కూడా చేయలేదు. అసలు ఖాతానే తెరవలేదు. బ్యాట్‌తో మైదానంలోకి రావడం తర్వాత పెవిలియన్ చేరడం అంతే సంగతులు.

కానీ ఇతడు అద్బుత బౌలర్‌. ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో 2 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 2 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీశాడు. అయితే వాస్తవానికి ఈ పది ఇన్నింగ్స్‌ల్లో ఇబాదత్ హుస్సేన్ ప్రతిసారీ అవుట్ కాలేదు. కానీ స్కోర్ చేయలేకపోయాడు. గణాంకాలను పరిశీలిస్తే గత 10 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 3 సార్లు మాత్రమే డకౌట్‌ అయ్యాడు. మిగతా 7 సార్లు అవతలి ఎండ్ బ్యాట్స్‌మెన్ ఔట్ కావడంతో పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. సరే ఏది ఏమైనప్పటికీ టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌లలో ఒక్క పరుగు కూడా చేయని ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

కోల్‌కతాలో భారత్‌పై చివరి పరుగు ఇబాదత్ హుస్సేన్ టెస్ట్ కెరీర్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఈ సమయంలో అతను 16 ఇన్నింగ్స్‌ల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. పరుగులు రాని చివరి 10 ఇన్నింగ్స్‌ల సంగతి పక్కన పెడితే తొలి 6 ఇన్నింగ్స్‌ల్లో 4 పరుగులు చేశాడు. 3 సంవత్సరాల క్రితం కోల్‌కతాలో భారత్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో ఇబాదత్ చివరి పరుగు సాధించాడు. అయితే అందులోనూ అతడికి విషాదమే ఎదురైంది. 2 పరుగులకు ట్రై చేశాడు కానీ 1 పరుగు మాత్రమే పొందాడు.

ఒక విచిత్రం..! ఈ గ్రామంలోని ప్రజలు నడుస్తూ, మాట్లాడుతూ ఆటోమేటిక్‌గా నిద్రపోతారు..?

షాకింగ్‌.. ఆ సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారట..! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu