Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Clock Vastu: జీవితంలో సమయం చాలా ముఖ్యం. మీ టైమ్‌ సరిగ్గా ఉంటే అంత బాగుంటుంది లేదంటే అంతే సంగతులు. మంచి, చెడు సమయానికి సంబంధించినవే.

Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..
Clock
Follow us
uppula Raju

|

Updated on: Jan 09, 2022 | 11:04 PM

Clock Vastu: జీవితంలో సమయం చాలా ముఖ్యం. మీ టైమ్‌ సరిగ్గా ఉంటే అంత బాగుంటుంది లేదంటే అంతే సంగతులు. మంచి, చెడు సమయానికి సంబంధించినవే. అవును మీ జీవితంలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు లేదా అడ్డంకులు ఉండకూడదంటే ఇంట్లో వాస్తు ప్రకారం గడియారాన్ని ఉంచాలి. గడియారం వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో గడియారం పెట్టేటప్పుడు వాస్తు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తు ప్రకారం గడియారాన్ని కొన్ని దిశలలో ఉంచడం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాలు ఎదురవుతాయి.

ఉదాహరణకు.. దక్షిణ గోడపై లేదా టేబుల్‌పై గడియారం ఉండటం వల్ల ఇంటి పెద్ద ఆరోగ్యం బాగుండదు. అదేవిధంగా గడియారాన్ని తలుపు పై ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం దెబ్బతింటుంది. ఇంట్లో ఎప్పుడు చెడిపోయిన గడియారం ఉండకూడదు. సమయాన్ని తప్పుగా చూపే గడియారం కూడా వాస్తు దోషాలకు కారణం అవుతుంది. ఈ పరిస్థితిలో వాటిని ఇంటి నుంచి తీసివేయడమే మేలు. వాస్తు ప్రకారం నలుపు, నీలం రంగు గడియారాలను ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే అలాంటి రంగులు ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.

గడియారాన్ని ఎక్కడ పెట్టాలి వాస్తు ప్రకారం.. గడియారాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ఎందుకంటే సానుకూల శక్తి తూర్పు, ఉత్తర దిశలలో ప్రవహిస్తుంది. అదేవిధంగా ఇంట్లో గడియారాన్ని ఉంచేటప్పుడు దాని పరిమాణంపై శ్రద్ధ వహించాలి. వాస్తు ప్రకారం ఇంటి గోడపై ఉంచే గడియారం ఆకారం ఎల్లప్పుడూ గుండ్రంగా లేదా చతురస్రాకారంగా ఉండాలి. అదేవిధంగా లోలకం ఉన్న గడియారం కూడా చాలా పవిత్రమైనది. వాస్తు ప్రకారం అలాంటి గడియారం ఇంట్లో ప్రేమ, పురోగతి, సామరస్యాన్ని పెంచుతుంది. కోణాల ఆకారంతో ఉన్న గడియారాన్ని నిషేధించాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Beauty Tips: హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడై పోయిందా..! ఇంట్లోనే నివారణ చర్యలు ప్రారంభించండి..

Realme GT 2 Pro సిరీస్ చైనా తర్వాత ఇండియాలోనే..! ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి..?

HDFC బ్యాంక్‌ ఖాతాదారులు అలర్ట్‌..! మారిన కొత్త నియమాలు తెలుసుకోండి..?