HDFC బ్యాంక్‌ ఖాతాదారులు అలర్ట్‌..! మారిన కొత్త నియమాలు తెలుసుకోండి..?

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పంపే మెస్సేజ్‌లకి చార్జ్‌ చేస్తుంది. బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు ఒక మెస్సేజ్‌కి 20 పైసలు, జీఎస్టీ చెల్లించాలి.

HDFC బ్యాంక్‌ ఖాతాదారులు అలర్ట్‌..! మారిన కొత్త నియమాలు తెలుసుకోండి..?
Hdfc
Follow us

|

Updated on: Jan 09, 2022 | 8:01 PM

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పంపే మెస్సేజ్‌లకి చార్జ్‌ చేస్తుంది. బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు ఒక మెస్సేజ్‌కి 20 పైసలు, జీఎస్టీ చెల్లించాలి. ఈ సర్వీస్‌కి బ్యాంక్ ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్ అని పేరు. దీని ద్వారా ఖాతాదారులకు మెస్సేజ్‌లు, ఈ-మెయిల్‌ల ద్వారా సమాచారం అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ కొత్త రూల్ గురించి తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఒక త్రైమాసికంలో ఇన్‌స్టా అలర్ట్ సేవలకు 3 రూపాయలు ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఒక్కో మెసేజ్‌కు 20 పైసలు, జీఎస్టీ కలిపి వసూలు చేస్తారు. కానీ ఈ-మెయిల్ హెచ్చరిక మునుపటిలా ఉచితంగా ఉంటుంది. ఈ మెయిల్ ద్వారా పంపిన మెస్సేజ్‌కి కస్టమర్ నుంచి ఎటువంటి ఛార్జ్‌ వసూలు చేయదు.

ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్ అంటే ఏమిటి HDFC బ్యాంక్ కస్టమర్‌లు ఇన్‌స్టా అలర్ట్ నుంచి బ్యాంకు లావాదేవీల సమాచారం పొందుతారు. ఈ హెచ్చరికల ద్వారా ఖాతాదారులకు ఆర్థిక లేదా ఆర్థికేతర సమాచారం అందిస్తారు. HDFC ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం లేదా డిపాజిట్ చేయడం లేదా ATM నుంచి మినీ స్టేట్‌మెంట్‌ చూడటం, లేదా బ్యాలెన్స్ చెక్ చేయడం వంటివి కస్టమర్‌కు ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్ ద్వారా తెలియజేస్తుంది. ఒక్కో మెసేజ్‌కి 20 పైసలు, జీఎస్టీ చెల్లించాలి. ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్ ద్వారా బిల్లు గడువు తేదీ, జీతం క్రెడిట్, ఖాతాలో తక్కువ బ్యాలెన్స్ మొదలైన వాటి గురించిన సమాచారం కూడా తెలియజేస్తుంది. అయితే ఈ సేవను తీసుకోవాలా వద్దా అనేది కస్టమర్‌పై ఆధారపడి ఉంటుంది.

నెట్ బ్యాంకింగ్ లావాదేవీ హెచ్చరికలు insta అలర్ట్ సేవల్లోకి రావు. ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్‌ నమోదు చేసుకోని కస్టమర్లకు బ్యాంక్ ఉచితంగా హెచ్చరికలు పంపుతుంది కానీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించిన హెచ్చరికలు పంపలేదు. ఈ సేవలు కేవలం ఇన్‌స్టా అలర్ట్ ద్వారా మాత్రమే తెలుస్తాయి. మీరు బ్యాంక్ నుంచి మెస్సేజ్‌లు పొందాలనుకుంటే మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి బ్యాంక్‌తో అప్‌డేట్ అయి ఉండాలని గుర్తుంచుకోండి.

Indigo Flight: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఇండిగో ఎయిర్‌లైన్స్ 20% విమానాలు రద్దు..

Bird Hit Plane: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఉలిక్కి పడ్డ ప్రయాణికులు.. ఫొటోలు చూస్తే షాక్‌..

Booster Dose: జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం.. ఈ నియమాలు తప్పనిసరి.. ఏంటంటే..?