Consumer Durables: ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషిన్‌లు కొనాలనుకుంటే వెంటనే కొనేయండి.. మార్చి తర్వాత మాత్రం..
Consumer Durables Price: కొత్తేడాదిలో ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి గృహోపకరణాల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ వస్తువుల తయారీకి అవసరయ్యే ముడి పదార్థాల ధరలు, రవాణా ఛార్జీలు...
Consumer Durables Price: కొత్తేడాదిలో ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి గృహోపకరణాల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ వస్తువుల తయారీకి అవసరయ్యే ముడి పదార్థాల ధరలు, రవాణా ఛార్జీలు పెరగడంతో వీటి ధరలు పెరిగాయి. కంపెనీలు పెరిగిన ఈ ధరలను కస్టమర్స్‌పై మోపడంతో గృహోపకరణాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే పెరిగిన ఈ ధరలు ఇక్కడితో ఆగవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్చి తర్వాత గృహోపకరణ వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా వాషింగ్ మెషీన్లలాంటి వస్తువుల ధరలు ఏకంగా 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌జీ, హయర్, ప్యానసోకిన్ వంటి ప్రముఖ బ్రాండ్‌లన్నీ ధరలు పెంచేశాయి. సోనీ, హిటాచీ, గోద్రేజ్ కంపెనీలు మార్చి నాటికి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అండ్ అప్లయన్సెస్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్’ అంచనా వేసింది.
ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో ధరల పెంపుదలని వాయిదా వేస్తూ వస్తున్నాయని.. సీఈఏఎంఏ అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వస్తువుల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వినియోగదారులకు ఒక సానుకూల అంశం ఏంటంటే.. ఒకవేళ డిమాండ్ పడిపోయి.. ముడి పదార్థాల ధరలు తగ్గితే ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ధరల్ని తగ్గించే అవకాశం ఉందని బ్రగాంజా తెలిపారు.
Also Read: Titan Eye X: భారత మార్కెట్లోకి టైటాన్ స్మార్ట్ గ్లాసెస్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా.?
Realme GT 2 Pro సిరీస్ చైనా తర్వాత ఇండియాలోనే..! ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి..?
RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్ వైట్ సినిమాకు ఎలా రీమిక్స్ చేశారో చూడండి..