- Telugu News Photo Gallery Technology photos Watch Company titan launches smart glasses titan eye have look on features and price
Titan Eye X: భారత మార్కెట్లోకి టైటాన్ స్మార్ట్ గ్లాసెస్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా.?
Titan Eye X: ప్రముఖ వాచ్ తయారీ కంపెనీ టైటాన్ తాజాగా స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించింది. టైటాన్ ఐ ప్లస్‌తో భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్లు, ధర విశేషాలు మీకోసం..
Updated on: Jan 09, 2022 | 10:32 PM

ప్రముఖ వాచ్ తయారీ సంస్థ టైటాన్ సరికొత్త కళ్లజోడును తయారు చేసింది. టైటాన్ ఐ ప్లస్ పేరుతో భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌ను ఉపయోగించారు. స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉన్న గ్లాసెస్‌తో కాల్స్ అటెండ్, సాంగ్స్ వ్యాల్యూమ్ అడ్జెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా బ్లూటూత్ సహాయంతో నోటిఫికేషన్‌లు వినొచ్చు. ఇందులోని క్లియర్ వాయిస్ టెక్నాలజీతో బహిరంగ ప్రదేశాల్లో స్పష్టమైన వాయిస్‌ను వినొచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఈ గ్లాసెస్ ప్రత్యేకత.

ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఫిట్‌నెస్ ట్రాక్ చేయడానికి ఇన్‌బిల్డ్ పెడోమీటర్‌ను అందించారు. ఐదు గంటల బ్యాటరీ బ్యాకప్ వీటి సొంతం.

ఇక ధర విషయానికొస్తే ఈ టైటాన్ స్మార్ట్ గ్లాసెస్ రూ.9,999గా ఉంది. ఆన్‌లైన్‌తో పాటు అన్ని టైటాన్ ఐ+ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.




