Iphone 12: యాపిల్ లవర్స్‌కి అదిరిపోయే వార్త.. ఏకంగా రూ.10,000 డిస్కౌంట్..
Iphone 12: అన్ని స్మార్ట్ ఫోన్‌లవి ఓ రేంజ్ అయితే యాపిల్ ఫోన్‌లది మరో రేంజ్. ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అలాంటిది. యాపిల్ ఫోన్‌ను స్టేటస్ సింబల్‌గా భావించే వారు కూడా ఉన్నారని చెప్పడంలో...
Iphone 12: అన్ని స్మార్ట్ ఫోన్‌లవి ఓ రేంజ్ అయితే యాపిల్ ఫోన్‌లది మరో రేంజ్. ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అలాంటిది. యాపిల్ ఫోన్‌ను స్టేటస్ సింబల్‌గా భావించే వారు కూడా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ధర విషయంలో మాత్రం యాపిల్ ఎక్కువేనని చెప్పాలి. ఈ మొబైల్స్‌పై ఆఫర్లు కూడా తక్కువగా ఉంటాయి. అయితే తాజాగా ఈకామర్స్ సైట్స్ ఐఫోన్‌పై భారీగా ఆఫర్లు ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీలపై అదిరిపోయే ఆఫర్లను అందించింది. ఇందులో భాగంగా దాదాపు రూ. 10,000 తగ్గిస్తూ ఆఫర్లు అందించింది.
ఎంత ధర తగ్గిందంటే..
* ఐఫోన్ 12 మినీ 64 జీబీ అసలు ధర రూ. 59,900 కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 40,900కి అందుబాటులో ఉంది. ఇక 128 జీబీఈ వేరియంట్ విషయానికొస్తే రూ.54,999, 56 జీబీ రూ. 64,999గా ఉన్నాయి.
* ఇక ఐఫోన్ 12 64 జీబీ అసలు ధర రూ. 65,900గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,999కే అందుబాటులో ఉంది. ఇక 128GB వేరియంట్ రూ.64,999కి పొందవచ్చు. అమేజాన్‌లో 64 జీబీ రూ. 63,900, 128GB వేరియంట్ రూ.70,900గా ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
* ఐఫోన్ 12లో 6.1 ఇంచెస్ స్క్రీన్, మినీలో 5.4 ఇంచెస్ స్క్రీన్‌ను ఇచ్చారు.
* రెండు ఫోన్లలో 13 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను అందించారు.
* వైడ్ యాంగిల్ కెమెరా, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరో ప్రత్యేకత.
* ఇక రెండు ఫోన్లలోనూ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు.
Also Read:Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..
దివినుంచి దిగివచ్చిన తారకలా మెరిసిన బ్యూటీ ..
Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..