AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ మహమ్మారి చేతికి చిక్కారు. ఈ విషయాన్ని తనే

Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..
Bandla Ganesh
Basha Shek
|

Updated on: Jan 09, 2022 | 10:04 PM

Share

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ మహమ్మారి చేతికి చిక్కారు. ఈ విషయాన్ని తనే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తన కరోనా రిపోర్టును ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు(ఆదివారం) సాయంత్రం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణైంది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. నా కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయాలనుకునేవారు ఒకసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’ అని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో తెలిపారు.

కాగా బండ్ల గణేష్‌ ప్రతీ వేవ్‌లో కరోనా బారిన పడుతున్నారు. మొదటి వేవ్‌లో కరోనా బారిన పడిన ఆయన త్వరగానే కోలుకున్నారు. కానీ రెండో వేవ్ సమయంలో మాత్రం గణేష్‌ ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారింది.  ఆ సమయంలో ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకోవాల్సి వచ్చింది. తాజాగా మూడోసారి కరోనాకు చిక్కారు.   మరోవైపు టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. నేడు (జనవరి9) రాజేంద్రప్రసాద్‌, విష్ణువిశాల్‌, త్రిష, థమన్, మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, విశ్వక్ సేన్‌, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు.

Also Read:

Coronavirus: సుప్రీంకోర్టును తాకిన కరోనా.. ఏకంగా 150 మంది పాజిటివ్‌..

RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్‌ వైట్‌ సినిమాకు ఎలా రీమిక్స్‌ చేశారో చూడండి..

Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!