Coronavirus: సుప్రీంకోర్టును తాకిన కరోనా.. ఏకంగా 150 మంది పాజిటివ్‌..

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌ మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్ వర్కర్లు పెద్ద ఎత్తున కొవిడ్‌ బారిన పడుతున్నారు

Coronavirus: సుప్రీంకోర్టును  తాకిన కరోనా.. ఏకంగా 150 మంది పాజిటివ్‌..
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2022 | 9:02 PM

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌ మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్ వర్కర్లు పెద్ద ఎత్తున కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ కార్యాలయంలోనూ సుమారు 400మంది సిబ్బందికి పైగా వైరస్‌కు గురయ్యారు. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఒకేసారి ఇంతమంది వైరస్ బాధితులవ్వడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు కూడా కరోనా తాకిడి మొదలైంది. ఇక్కడి నలుగురు న్యాయమూర్తులతో సహా దాదాపు 150 మంది సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు.

కాగా న్యాయస్థానంలో మొత్తం 3వేల మంది సిబ్బంది ఉండగా దాదాపు 5 శాతం (150) మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సుప్రీం పాలనా విభాగం అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ విజృంభణతో న్యాయస్థానం ఆవరణలోనే కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్‌కు తోడు కొత్త కేసుల పెరుగుదలతో తేలికపాటి లక్షణాలున్న వారు కూడా తప్పనిసరిగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో జనవరి 3 నుంచి సుప్రీం కోర్టులో వర్చువల్‌గా కేసుల విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల పాటు ఇదే విధానంలోనే కేసుల విచారణ జరగనుంది. కాగా ఢిల్లీలో శనివారం ఒక్కరోజే 20, 181 కొత్త కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు కూడా 19.6 శాతానికి ఎగబాకింది. ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Also Read:

RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్‌ వైట్‌ సినిమాకు ఎలా రీమిక్స్‌ చేశారో చూడండి..

Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..

Mammootty: రీయూనియన్‌ పార్టీలో మలయాళ మెగాస్టార్‌.. క్లాస్‌మేట్స్‌తో దిగిన ఫొటోలు వైరల్..