Mammootty: రీయూనియన్‌ పార్టీలో మలయాళ మెగాస్టార్‌.. క్లాస్‌మేట్స్‌తో దిగిన ఫొటోలు వైరల్..

మమ్ముట్టి.. మలయాళ మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన ఈ హీరో తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి కిరణం’ సినిమాలో నటించిన ఆయన ఆతర్వాత

Mammootty: రీయూనియన్‌ పార్టీలో మలయాళ మెగాస్టార్‌.. క్లాస్‌మేట్స్‌తో దిగిన ఫొటోలు వైరల్..
Mammootty Reunion
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2022 | 7:57 PM

మమ్ముట్టి.. మలయాళ మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన ఈ హీరో తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి కిరణం’ సినిమాలో నటించిన ఆయన ఆతర్వాత రజినీకాంత్‌తో కలిసి ‘దళపతి’ సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’తో మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించారు. 50 ఏళ్ల నటప్రస్థానంలో సుమారు 400కు పైగా సినిమాల్లో నటించి భారతీయ దిగ్గజ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇక ఆయన తనయుడు దుల్కార్ సల్మాన్ కూడా ఎంట్రీ ఇచ్చి తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్నాడు. కాగా మమ్ముట్టి ఫొటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు విపరీతంగా ఈ ఫొటోను షేర్ చేసుకుటున్నారు.

ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. తన క్లాస్‌మేట్స్‌తో కలిసి మమ్ముట్టి రీయూనియన్ అయ్యారు. మహారాజా కాలేజీలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల కలయిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన క్లాస్‌మేట్స్‌ని కలుసుకున్నారు. వారితో సరదాగా ముచ్చటించారు. కాగా మమ్ముట్టి ఛారిటీ నిర్వహణ వ్యవహారాలను చూసుకునే రాబర్ట్ జిన్స్ ఈ రీయూనియన్‌ ఫొటోలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్‌ చేశాడు. దీంతో అవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ‘సూపర్బ్‌ సర్‌ ‘ అంటూ కామెంట్ సెక్షన్‌ని నింపేస్తున్నారు.

Also Read:

Viral video: హరియాణా క్వీన్‌కు పోటీగా ముసలాయన హుషారైన స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Coronavirus: ఏపీలో పెరుగుతోన్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..

AusVsEng: త్రుటిలో మరో ఓటమిని తప్పించుకున్న ఇంగ్లండ్‌.. ఆసీస్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన బ్రాడ్‌, అండర్సన్‌..