Coronavirus: ఏపీలో పెరుగుతోన్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..

కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో

Coronavirus: ఏపీలో పెరుగుతోన్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..
Ap Corona
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2022 | 6:10 PM

కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ ఆందోళనలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదివారం (జనవరి 9) కొత్తగా 1,257 మంది వైరస్‌ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 38, 479శాంపిల్స్ పరీక్షించారు. కాగా వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 140 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి దాకా 3,16,05,951 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 20,78, 964 మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా 20, 59, 685 మంది వైరస్‌ను జయించారు. మొత్తం 14505 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

AusVsEng: త్రుటిలో మరో ఓటమిని తప్పించుకున్న ఇంగ్లండ్‌.. ఆసీస్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన బ్రాడ్‌, అండర్సన్‌..

Coronavirus: మాస్క్‌ వల్లే నా ముఖం ఇలా అయింది.. నాకు మాత్రం తప్పదు..

Ramesh Babu: కన్నీరు పెట్టిస్తోన్న మహేష్‌ పోస్ట్‌.. అన్నయ్యా..నాకు అన్నీ నీవేనంటూ..