Coronavirus: మాస్క్‌ వల్లే నా ముఖం ఇలా అయింది.. నాకు మాత్రం తప్పదు..

కొవిడ్‌ సంక్షోభంతో దేశం మళ్లీ ఉక్కిరిబిక్కరవుతోంది. ఒమిక్రాన్‌తో పాటు కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక సినిమా, టీవీ నటీనటులైతే వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌..

Coronavirus: మాస్క్‌ వల్లే నా ముఖం ఇలా అయింది.. నాకు మాత్రం తప్పదు..
Hina Khan
Basha Shek

|

Jan 09, 2022 | 8:07 PM

కొవిడ్‌ సంక్షోభంతో దేశం మళ్లీ ఉక్కిరిబిక్కరవుతోంది. ఒమిక్రాన్‌తో పాటు కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక సినిమా, టీవీ నటీనటులైతే వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌.. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా వైరస్‌ బాధితుల జాబితాలో చేరిపోతున్నారు. ఈక్రమంలో హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా ఖాన్ కుటుంబం కరోనా బారిన పడింది. అదృష్టవశాత్తూ ఆమెకు తప్ప అందరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈనేపథ్యంలో వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు నిత్యం మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతున్నానంటోంది. అందుకు తన ముఖం మీద ఎర్రటి మచ్చలే నిదర్శనమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

‘ఈ రోజుల్లో జీవితమన్నా సోషల్‌ మీడియా అన్నా .. ఏదైనా మంచి ఫొటోలు సమకూర్చుకోవడమే. దానికి అందరమైన విజువల్స్‌ జోడించడమే. కానీ 2022కి వచ్చేసరికి పరిస్థితులు 2020 కంటే కూడా సంక్లిష్టంగా మారిపోయాయి. ఇంట్లో అందరూ కొవిడ్ 19 పాజిటివ్ గా తేలి.. మీరొక్కరే నెగెటివ్‌గా ఉన్నప్పుడు… మాస్కులు, శానిటైజర్లతో సన్నద్ధం కావడం తప్ప మరో మార్గమేదీ ఉండదు . ఈ క్రమంలో 24 గంటల సేపు మాస్కులు ధరించడం వల్ల ముఖం మీద ఇలాంటి మరకలు తప్పవు మరి. ఇలా మరకలు, యుద్ధ చిహ్నాలతో… మరోసారి కొవిడ్‌పై పోరాటం చేద్దాం రండి’ అని రాసుకొచ్చింది హీనా ఖాన్‌. ఇందులో ఆమె చర్మం ఎర్రగా కమిలిపోయి ముఖంపై ఎర్రటి మచ్చలు ఉండడం స్పష్టంగా చూడవచ్చు. కాగా బాలీవుడ్‌లో కరీనాతో పాటు అర్జున్‌ కపూర్‌, ఏక్తాకపూర్‌, స్వరాభాస్కర్‌, జాన్‌ అబ్రహాం దంపతులు, మృణాళ్‌ ఠాకూర్‌ తదితర ప్రముఖులు కరోనాకు గురయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)


Also Read:

Ramesh Babu: కన్నీరు పెట్టిస్తోన్న మహేష్‌ పోస్ట్‌.. అన్నయ్యా..నాకు అన్నీ నీవేనంటూ..

Rajendra Prasad: సినిమా ఇండస్ట్రీని వదలని మహమ్మారి.. మరో సీనియర్ హీరోకు కరోనా పాజిటివ్..

Ramesh Babu Passed Away: రమేష్ బాబు ఆకస్మిక మరణంతో రద్దైన కుర్ర హీరో డెబ్యూ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu