Ramesh Babu: కన్నీరు పెట్టిస్తోన్న మహేష్‌ పోస్ట్‌.. అన్నయ్యా..నాకు అన్నీ నీవేనంటూ..

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతోన్న ఆయన నిన్న (జనవరి8) రాత్రి కన్నుమూశారు.

Ramesh Babu: కన్నీరు పెట్టిస్తోన్న మహేష్‌ పోస్ట్‌.. అన్నయ్యా..నాకు అన్నీ నీవేనంటూ..
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2022 | 4:15 PM

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతోన్న ఆయన నిన్న (జనవరి8) రాత్రి కన్నుమూశారు. కాగా నేడు జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో నిర్వహించిన రమేష్ బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ బాబుకు తుది వీడ్కోలు పలికారు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా రమేష్ మృతి పట్ల సంతాపం పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు.

నీవే నాకు స్ఫూర్తి.. కాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో అన్నయ్య అంత్యక్రియల్లో ఆయన పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. కాగా సోదరుడి మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈక్రమంలో హోం ఐసోలేషన్‌లో ఉంటోన్న మహేష్‌ను నమ్రత ఓదార్చారు. ఆయనకు ధైర్యం చెబుతున్నారు. కాగా అన్నయ్య కడసారి చూపునకు నోచుకోలేక పోయిన మహేష్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాల ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకున్నారు. ‘మీరే నాకు ఆదర్శం. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుండా ఉంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మహేశ్‌.

Also Read:

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Shivani Rajashekar: ‘శివాని రాజశేఖర్‌’ హాట్ లుక్స్ పై మీరు ఓ లుక్కేయండి.. లేటెస్ట్‌ ఫోటోస్..

Ramesh Babu: తనయుడు భౌతికకాయం వద్ద కృష్ణ కన్నీరు.. మరోవైపు అన్న చివరి చూపుకు మహేష్ దూరం.. చూపరులను కంట తడిపెట్టుస్తున్న వైనం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?