Bangarraju Musical Night : బంగార్రాజు పాటల సందడి.. గ్రాండ్ గా మ్యూజికల్ నైట్..

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.

Bangarraju Musical Night : బంగార్రాజు పాటల సందడి.. గ్రాండ్ గా మ్యూజికల్ నైట్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 09, 2022 | 7:00 PM

Bangarraju Musical Night : అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ సినిమా బంగార్రాజు మ్యూజిక్ నైట్ అనే పేరుతో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. అలాగే ఈ సినిమా లో నాగార్జున స్వయంగా ఓపాటను కూడా పాడారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా చైతన్య కు జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. ఇక ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు.

మరిన్నిఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…