AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్‌ వైట్‌ సినిమాకు ఎలా రీమిక్స్‌ చేశారో చూడండి..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ హీరోలుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అలియా భట్, ఒలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖణి తదితరులు

RRR: ఇంకా క్రేజ్ తగ్గని 'నాటు నాటు'.. బ్లాక్ అండ్‌ వైట్‌ సినిమాకు ఎలా రీమిక్స్‌ చేశారో చూడండి..
Rrr Song
Basha Shek
|

Updated on: Jan 09, 2022 | 8:12 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అలియా భట్, ఒలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామా జనవరి 7 న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా కీరవాణి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా పాటలు సంగీతాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘నాటు నాటు’ సాంగ్‌ సంగీత ప్రియుల్ని ఉర్రూలూగించింది. గతేడాది విడుదలైన ఈ పాట యూట్యూబ్‌ రికార్డులను కొల్లగొట్టేసింది. ఇక నెటిజన్లయితే కవర్‌ సాంగ్‌లు, స్ఫూప్‌లు, రీమిక్స్‌లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయారు. ఈక్రమంలో ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్‌ ఇంకా తగ్గలేదనిపిస్తోంది. ఇందుకు నిదర్శనమే ఓ నెటిజన్‌ పంచుకున్న వీడియో.

ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలోని ఇద్దరు నటుల డ్యాన్స్‌కు ఈ సాంగ్‌ను జోడించిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అందరి చేతా నవ్వులు పూయిస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు వేలాది సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో రీట్వీట్లు, కామెంట్లు వస్తున్నాయి. ‘పర్‌ఫెక్స్‌ రీమిక్స్‌’, ‘సూపర్‌ స్ఫూప్‌’, ‘ అమేజింగ్‌ వీడియో’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..

Mammootty: రీయూనియన్‌ పార్టీలో మలయాళ మెగాస్టార్‌.. క్లాస్‌మేట్స్‌తో దిగిన ఫొటోలు వైరల్..

Viral video: హరియాణా క్వీన్‌కు పోటీగా ముసలాయన హుషారైన స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి