Rashmika Mandanna: పుష్ప హిట్‌తో భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన రష్మిక!.. ఒక్కో సినిమాకు ఏకంగా..

'ఛలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఆతర్వాత విజయ్‌ దేవరకొండ సరసన నటించి 'గీత గోవిందం'

Rashmika Mandanna: పుష్ప హిట్‌తో భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన రష్మిక!.. ఒక్కో సినిమాకు ఏకంగా..
Rashmika Mandanna
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2022 | 10:03 PM

‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఆతర్వాత విజయ్‌ దేవరకొండ సరసన నటించి ‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆతర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘దేవదాస్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్ సొంతం చేసుకుంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై తనదైన నటనతో మెప్పించే ఈ ముద్దుగుమ్మ సినిమా ఈవెంట్లలో చేసే సందడి మాములుగా ఉండడం లేదు. తన అల్లరి చేష్టలు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ఇక ఇటీవల ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో జంటగా నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంతో తన ఖాతాలో మరో భారీ విజయాన్ని వేసుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతోన్న ఈ అందాల తార ఇప్పుడు తన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచేసిందని తెలుస్తోంది.

పాన్‌ ఇండియా చిత్రంగా వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ కోసం ఆమె సుమారు రూ.2 కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం. అయితే సినిమా 5 భాషల్లో రిలీజ్‌ కావడం, సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప: ది రూల్‌’ తో పాటు రాబోయే కొత్త సినిమాలకు ఏకంగా రూ. 3 కోట్ల వరకు డిమాండ్‌ చేసిందని తెలుస్తోంది. కాగా పుష్ప సీక్వెల్‌తో పాటు శర్వానంద్‌కు జంటగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీలో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాలు చేస్తోంది.

Also Read:

Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..

Coronavirus: సుప్రీంకోర్టును తాకిన కరోనా.. ఏకంగా 150 మంది పాజిటివ్‌..

SCR: సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ధరలు.. ప్రస్తుతం ఏ స్టేషన్‌లో ఎంత ఉందంటే..